AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puducherry Polls : ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టి.. అదిరిపోయే వ్యూహంతో ఎన్నికల బరిలోకి విజయ్!

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు చివరి రోజు రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్-డీఎంకే కూటమిలో, ఎన్డీఏ కూటమిలోనూ సీట్ల సర్దుబాటుపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. కానీ కొత్తగా బరిలోకి దిగిన టీవీకే మాత్రం ఒంటరిగా 30 స్థానాల్లో పోటీకి సిద్ధమై, అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించి, వారితో నామినేషన్లు కూడా దాఖలు చేయించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Puducherry Polls : ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టి.. అదిరిపోయే వ్యూహంతో ఎన్నికల బరిలోకి విజయ్!
Puducherry Elections 2026
Ch Murali
| Edited By: |

Updated on: Mar 24, 2026 | 12:26 PM

Share

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్స్ కూడా విడుదలయ్యాయి. ఇక తొలివిడతగా ఏప్రిల్ 9వ తేదిన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 23న పుదుచ్చేరి పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే తమిళనాడును ఆనుకునే ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతిసారి తమిళ పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. అయితే పదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడవు ముగుస్తున్నా.. ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల విషయంలో ఇంకా సీట్ల పంచాయతీ కొనసాగుతూనే వచ్చింది. దీంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నామినేషన్లకు చివరి రోజైనా సోమవారం అర్థరాత్రి వరకు ప్రధాన పార్టీలైన డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి. ఓవైపు కాంగ్రెస్‌కు పట్టున్న స్థానాలను కావాలంటు డీఎంకె పట్టుబట్టగా, గతంలో తాము పోటీ చేసిన స్థానాలు తమకే కావాలంటూ ఇటు కాంగ్రెస్ పట్టుపట్టింది. రెండు పార్టీల మధ్య అర్థరాత్రి వరకు జరిగిన చర్చల తర్వాత చివరికి కాంగ్రెస్ 16 డిఎంకె 12, వీసీకే ఒకటి సిపిఐ ఒకటి స్థానాల్లో పోటీకి ఒప్పందం కుదిరింది.

ఎన్డీఏ కూటమి

ముఖ్యమంత్రి రంగసామి నేతృత్వంలోని ఏఐ ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రస్తుతం బిజెపితో కలిసి కూటమిగా పోటీ చేస్తోంది. ఈ కూటమిలో ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్లో, బిజెపి 10 స్థానాల్లో, ఏఐఏడిఎంకే, ఎల్‌జెకే చెరో 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్ ఆర్ కాంగ్రెస్‌లో అభ్యర్థులకు ఇంకా బీ ఫార్మ్ లు అందలేదు. ఇది ఇలా ఉంటే సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సైతం పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. విడతల వారీగా కాకుండా ఒకేసారి మొత్తం అభ్యర్థుల జాబితాను రెండు రోజుల క్రితమే విజయ్ విడుదల చేశారు. టివికే 30 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేయడంతో అభ్యర్థులందరూ నామినేషన్లు కూడా దాఖలు చేశారు.

ఇటు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకేతో పొత్తుకోసం బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేసింది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన విజయ్, ఏ పెద్ద పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా తన బలాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే పుద్దుచ్చేరిలో కూడా ఎన్ఆర్ కాంగ్రెస్ లేదా డిఎంకె వంటి ప్రధాన పార్టీలకు దూరంగా ఉండి 30 నియోజకవర్గాల్లోనూ తన కూటమి అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో కొత్తగా పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ ధైర్యంగా ఎవరితోనూ పొత్తు లేకుండా బరిలోకి నిలవడంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. చూడాలి మరి విజయ్‌ను విజయం వరిస్తుందో లేదో.

మరిన్ని  జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!