కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం ఉధృతం.. హెలిప్యాడ్‌ను తవ్వేసిన రైతులు..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు. తాజాగా హర్యానా..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు. తాజాగా హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతలాకు తమ నిరసన గళం వినిపించారు. వివరాల్లోకెళితే.. తన నియోజకవర్గం ఉచనాలో దుష్యంత చౌతలా పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన ఉచనాకు వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ క్రమంలో హెలిప్యాడ్‌ను కూడా అధికారులు సిద్ధం చేశారు. అయితే చౌతలాను నియోజకవర్గంలో అడుగుపెట్టొద్దంటూ అక్కడి రైతులు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని, ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉచనాలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను ఆందోళనకారులు పారలతో తవ్వారు. కాగా, రైతుల ఆందోళనల నేపథ్యంలో అధికారులు ఆయనకు సమాచారం అందజేశారు. ఉచనా పర్యటనను రద్దు చేసుకుంటేనే మంచిదని సూచించారు. దాంతో చౌతలా తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
Also read:
Good News: ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!