Tamil Nadu: భగ్గుమన్న నిరసనలు.. స్కూల్ బస్సులకు నిప్పు.. నిరనసకారులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

|

Jul 17, 2022 | 7:59 PM

త‌మిళ‌నాడులో (Tamil Nadu) 12వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బాలిక మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమంటూ నిరసనకారులు స్కూల్‌ బస్సులకు నిప్పంటించారు....

Tamil Nadu: భగ్గుమన్న నిరసనలు.. స్కూల్ బస్సులకు నిప్పు.. నిరనసకారులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
Protest In Tamilnadu
Follow us on

త‌మిళ‌నాడులో (Tamil Nadu) 12వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బాలిక మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమంటూ నిరసనకారులు స్కూల్‌ బస్సులకు నిప్పంటించారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులే ల‌క్ష్యంగా నిరసనకారులు దాడులకు పాల్పడ్డారు. తమిళనాడులో కళ్లకురిచ్చిలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిని 12వ తరగతి చదువుతోంది. అనుమానాస్పద స్థితిలో ఆమె పాఠశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న బాలిక కుటుంబసభ్యులు.. విద్యార్థిని మృతికి స్కూల్ యాజ‌మాన్యమే కార‌ణ‌మని ఆరోపించారు. అంతటితో ఆగకుండా వాదనకు దిగారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పాఠశాల ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పార్కింగ్‌ చేసి ఉన్న బస్సులకు నిప్పంటించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించారు. డీజీపీ, హోంశాఖ కార్యదర్శి వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బాలిక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

త‌మిళ‌నాడు రాష్ట్రం కళ్లకురిచి సమీపంలోని చిన్న సేలంలో ఉన్న ప్రైవేట్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఓ విద్యార్థిని 12వ తరగతి చదువుతోంది. ఇద్దరు ఉపాధ్యాయులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి మృతదేహాన్ని జులై 13న స్కూల్‌ వాచ్‌మెన్‌ మైదానంలో గుర్తించాడు. విషయాన్ని వెంటనే స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు.. భారీగా పాఠశాల వద్దకు చేరుకున్నారు. పోస్ట్‌ మార్టం రిపోర్టులో విద్యార్థిని శరీరంపై గాయలున్నట్లు వెల్లడైంది. దీంతో బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఆదివారం నిరసనకారులు రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణకు చేరుకున్నారు. టీచ‌ర్ల‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.తమ కుమార్తె గాయపడిందని పాఠశాల యాజమాన్యం నుంచి తమకు సమాచారం అందిందని మృతురాలి తల్లి వెల్లడించారు. త‌రువాత ఆస్పత్రిలో చ‌నిపోయింద‌ని చెప్పారని కన్నీటిపర్యంతమయ్యారు. రక్తస్రావం, గాయాల కారణంగా షాక్‌కు గురై మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. గాయాలకు మూలం ఏమిటంటూ మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం చేయాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయవార్తల కోసం క్లిక్ చేయండి..