Miraya Vadra: రాహుల్, ప్రియాంక గాంధీల మధ్య ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?
మిరయా వాద్ర సోషల్ మీడియా అకౌంట్స్ కూడా పెద్ద యాక్టివ్‌గా లేవు. ప్రజంట్ ఆమె భారత్ జోడో యాత్రలో పాల్గొనడంతో అందరి ఫోకస్ ఆమెపై పడింది.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లోని బుండి జిల్లాలోని లఖేరీ పట్టణం నుండి తిరిగి ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖూ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా.. వారి కుమార్తె మిరయా యాత్రలో పాల్గొన్నారు. జానపద గేయాలతో పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలు చూస్తూ.. వారిపై పూల వర్షం కురిపిస్తూ ప్రజలు స్వాగతం పలికారు. నారీశక్తి పాదయాత్రగా సోమవారం భారత్ జోడో యాత్రకు నామకరణం చేశారు. వందలాదిమంది మహిళలు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. ప్రియాంక కుమార్తె మిరయా ఈ యాత్రలో పాల్గొనడం హైలెట్‌గా చెప్పవచ్చు. సహజంగా ఆమె ఎక్కువగా బయటకు రారు. సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్‌గా ఉండరు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలకు తన మేనకోడలును పరిచయం చేశారు రాహుల్. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 20 ఏళ్ల మియారా విదేశాల్లో చదువుకుంది. గత కొంతకాలంగా మాల్దీవులలో ఇన్‌స్ట్రక్టర్ స్థాయి డైవింగ్ కోర్సులు చేస్తోంది.
करोंड़ों आंखों से देखे गए सपनों को अपनी आंखों में संजोए आगे बढ़ रहा है कोई… अब रुकना इसे मंजूर नहीं। #BharatJodoYatra pic.twitter.com/M6G9ewVwtH
— Congress (@INCIndia) December 11, 2022
Priyanka Gandhi & Miraya Vadra also joined to walk with Rahul Gandhi… pic.twitter.com/Rdmy8qohbK
— Aaron Mathew (@AaronMathewINC) December 11, 2022
కాగా రాహుల్ గాంధీ దహీ ఖేరా గ్రామం గుండా వెళుతుండగా..ఒక ఇంటికి వెళ్లి, అంగవైకల్యంతో జీవిస్తున్న ఎనిమిదేళ్ల బాలికతో మాట్లాడారు. ఆమె ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు విని చలించిపోయిన రాహుల్.. వెంటనే యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రి అశోక్ చందనాకు ఫోన్ చేసి బాలికకు మెరుగైన చికిత్స అందేలా చూడాలిని కోరారు. చందనా సానుకూలంగా స్పందించారు.
తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 95వ రోజు కొనసాగుతోంది. ఎనిమిది రాష్ట్రాల పర్యటన ముగించుకుని జోడో యాత్ర రాజస్థాన్ మీదుగా ముందుకు సాగుతోంది. 150 రోజుల్లో 12 రాష్ట్రాల మీదుగా 3570 కి.మీ ప్రయాణించిన తర్వాత ఈ యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి