Narendra Modi: చెన్నై వరద బాధితులకు కేంద్రం భారీ సాయం.. ఇప్పటికీ నీట మునిగిన పలు ప్రాంతాలు..

|

Dec 07, 2023 | 9:17 PM

మిచౌంగ్ తుఫాను తమిళనాడులోని చెన్నైని ముంచేసింది. ఇప్పటికీ వరద ధాటికి అక్కడి ప్రజలు కోలుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించేందుకు సిద్దమైంది. దీంతో పాటూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై బెసిన్‌ ప్రాజెక్టులో భాగంగా ‘ఇంటిగ్రేటెట్‌ అర్బన్‌ ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌’ కు పచ్చజెండా ఊపింది.

Narendra Modi: చెన్నై వరద బాధితులకు కేంద్రం భారీ సాయం.. ఇప్పటికీ నీట మునిగిన పలు ప్రాంతాలు..
Prime Minister Narendra Modi Has Provid Financial Assistance To Chennai Flood Victims
Follow us on

మిచౌంగ్ తుఫాను తమిళనాడులోని చెన్నైని ముంచేసింది. ఇప్పటికీ వరద ధాటికి అక్కడి ప్రజలు కోలుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించేందుకు సిద్దమైంది. దీంతో పాటూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై బెసిన్‌ ప్రాజెక్టులో భాగంగా ‘ఇంటిగ్రేటెట్‌ అర్బన్‌ ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌’ కు పచ్చజెండా ఊపింది. ఈ సందర్భంగా వరద సహాయ సహకారాలకు అవసరమైన నిధిని విడుదల చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందులో భాగంగానే రూ. 561 కోట్ల నిధులను చెన్నై వరద సహాయానికి అందించనున్నారు ప్రధాని మోదీ. చెన్నై సముద్రతీరానికి దగ్గరగా ఉండటంతో తరచూ వచ్చే భారీ వర్షాలకు నగరం మొత్తం జలమయంగా మారిపోతుంది. మోకాళ్లు, నడుము లోతు నీళ్ళల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

గత ఎనిమిదేళ్లలో మూడు భారీ వరదలు చెన్నైని ముంచెత్తింది. దీంతో మూడుసార్లు చెన్నై నగరం నీట మునిగింది. ఇక అసలు విషయానికొస్తే.. నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (NDMF)కింద ప్రధాని మోదీ మొదటిసారి చెన్నై నగరానికి వరద సాయం నిధులను ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం వరదల సాయంగా రూ.500 కోట్లను కలుపుకొని మొత్తం రూ. 561.29కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. చెన్నైలో కురిసిన భారీ వర్షాలు, వర్షాల కారణంగా పోటెత్తిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం పరిశీలించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ వరదలపై ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత మొదటి విడత వరద సాయంగా రూ. 450 కోట్లు విడుదల చేశారు. మిగిలిన రెండో విడత సాయం త్వరలో విడుదల కానునుంది. కేంద్రం నుంచి వచ్చిన సాయంతో తమిళనాడు ప్రభుత్వానికి కాస్త ఊరట కలిగినట్లయింది.

వరదల్లో ఇళ్లు కొట్టుకొని పోయి కొందరు, కూలిపోయి కొందరు నిరాశ్రయులైయ్యారు. దీంతో వారిని పునరావాస కేంద్రాల్లో ఉంచి ఆహారం, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల అన్నం ప్యాకెట్లను హెలికాప్టర్ల ద్వారా అందజేస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు, బెడ్ షీట్లు అందజేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..