WITT: ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ సమ్మిట్ వేదికపై ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికన 28మంది పిల్లలు.. ఎవరో తెలుసా?
PM Narendra Modi: టీవీ9 నిర్వహిస్తున్న "వాట్ ఇండియా థింక్స్ టుడే" (WITT) సమ్మిట్ 2025 మూడవ ఎడిషన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా, ఫుట్‌బాల్ టాలెంట్ హంట్‌లో దేశవ్యాప్తంగా ఎంపికైన 28 పిల్లలు ప్రధాని మోదీతో వేదికను పంచుకుని ఆయనకు స్వాగతం పలికారు.

What India Thinks Today: అతిపెద్ద వార్తా నెట్‌వర్క్ TV9 నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ (WITT 2025)కు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిభ ఉన్న ప్రత్యేక పిల్లలు కొందరు ఆయనకు స్వాగతం పలికారు. ఫుట్‌బాల్‌కు కొత్త శక్తినిచ్చేందుకు, ‘న్యూస్9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్సెస్’ ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ టాలెంట్ హంట్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎంపికైన పిల్లలే మన ప్రధానికి ఘన స్వాగతం పలికారు.
‘న్యూస్9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్సెస్’ కోసం టాలెంట్ హంట్ ద్వారా 12 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల బాలురు, బాలికలను ఎంపిక చేసి, వారికి ప్రపంచ స్థాయి శిక్షణ అందించడమే దీని లక్ష్యం. దేశవ్యాప్తంగా ఎంపికైన 28 మంది పిల్లలను WITT వేదికపై సత్కరించారు. ప్రధానమంత్రి మోడీ ఈ పిల్లలను పొగడ్తలతో ముంచెత్తారు.
ఆస్ట్రియన్ రాయబారి కాథరినా వీజర్, VFB స్టట్‌గార్ట్ బోర్డు సభ్యుడు రూవెన్ కాస్పర్, TV9 నెట్‌వర్క్ సీఈవో, ఎండీ బరున్ దాస్, TV9 నెట్‌వర్క్ హోల్ టైమ్ డైరెక్టర్ హేమంత్ శర్మ, బుండెస్లిగా సలహాదారు పీటర్ లీబుల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీవీ9 నెట్‌వర్క్ సీఈఓ, ఎండీ బరుణ్ దాస్ మాట్లాడుతూ, ప్రధాని మోదీకి పిల్లలంటే ఎంతో ఇష్టమని , పిల్లలు ప్రధానిని ప్రేమిస్తారని అన్నారు. ఈ యువ ఫుట్‌బాల్ ప్రతిభ తొమ్మిది నెలల క్రితం ప్రారంభమైంది. ఇది స్వామి వివేకానంద నుంచి ప్రేరణ పొందింది. ఈ 28 మంది పిల్లలకు ఆస్ట్రియా, జర్మనీలలో శిక్షణ ఇస్తాం. అయితే, వీరందరికి ప్రధాని మోదీని కలిసే అరుదైన అవకాశం లభించింది. పిల్లలందరూ మోదీ ఆశీస్సులు అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వీరు దేశానికి గౌరవాన్ని తెస్తారని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.
టీవీ9 నెట్‌వర్క్ ప్రత్యేక చొరవ..
యూరప్‌లోని ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ సంస్థలు – DFB పోకల్, బుండెస్లిగా, ఇండియా ఫుట్‌బాల్ సెంటర్, IFI, BVB, రిస్పో – వంటి ప్రముఖ సంస్థల సహకారంతో TV9 ఈ ప్రత్యేకమైన చొరవను చేపట్టింది. ఈ ట్యాలెంట్ హంట్‌లో ఈ పిల్లలను 50 వేల మంది నుంచి ఎంపిక చేశారు. ఈ పిల్లలకు ఫుట్‌బాల్ ఆడటానికి, శిక్షణ పొందడంతోపాటు గౌరవం పొందడానికి కూడా అవకాశం లభిస్తుంది.
ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ‘చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించడం’, తద్వారా భారత ఫుట్‌బాల్ అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపును పొందగలదని తెలియజేస్తుంది. యువ ఆటగాళ్లకు యూరోపియన్ కోచింగ్, మార్గదర్శకత్వం లభించడం ద్వారా భారతదేశ ఫుట్‌బాల్ భవిష్యత్తు బలపడుతుందని భావిస్తున్నారు. ఈ టాలెంట్ హంట్ నుంచి ఎంపికైన పిల్లలకు టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే మూడవ ఎడిషన్‌లో పాల్గొన్న ప్రధాని మోదీని కలిసే అవకాశాన్ని కూడా అందించింది.
రెండు రోజుల కార్యక్రమం..
రెండు రోజుల పాటు జరిగే ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ సమ్మిట్ (మార్చి 28-29) రాజకీయాలను మాత్రమే కాకుండా, పరిశ్రమ, క్రీడలు, సినిమా రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు కూడా దీనిలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
టీవీ9 నెట్‌వర్క్ మెగా ఈవెంట్‌లో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా మునుపటి ఎడిషన్‌లో పాల్గొన్నారని, టీవీ 9ను ప్రశంసిస్తూ దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొంటున్నారంటే?
రెండు రోజుల పాటు జరిగే వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్, పియూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, జి కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్ తమ అభిప్రాయాలను ఈ వేదికలో పంచుకోనున్నారు.
ఈ మెగా కార్యక్రమానికి మత గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రితో పాటు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు సునీల్ అంబేకర్ కూడా హాజరు కానున్నారు. పాకిస్తాన్, కెనడాలకు భారత మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా కూడా హాజరవుతారు. వీరితో పాటు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమ, సినిమా, క్రీడా ప్రపంచానికి చెందిన ప్రముఖ వ్యక్తులు కూడా వేదికపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..