భక్తురాలి చెంప ఛెళ్లుమనిపించిన పూజారి..

తమిళనాడులో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆలయానికి వచ్చిన భక్తురాలికి పూజారి చుక్కలు చూపించాడు. చిదంబరం నటరాజ ఆలయంలో ఓ పూజారి.. భక్తురాలి చెంపఛెళ్లుమనిపించాడు. భాదితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అతడు కనపడకుండా పారిపోయాడు. పూజారికి, ఆ మహిళకు మధ్య చోటుచేసుకున్న వాగ్వివాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. లత అనే మహిళ తన కుమారుడు రాజేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ ఆలయానికి వెళ్లి, పూజాసామగ్రిని ఆలయ పూజారి దర్శన్ […]

భక్తురాలి చెంప ఛెళ్లుమనిపించిన పూజారి..

తమిళనాడులో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆలయానికి వచ్చిన భక్తురాలికి పూజారి చుక్కలు చూపించాడు. చిదంబరం నటరాజ ఆలయంలో ఓ పూజారి.. భక్తురాలి చెంపఛెళ్లుమనిపించాడు. భాదితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అతడు కనపడకుండా పారిపోయాడు. పూజారికి, ఆ మహిళకు మధ్య చోటుచేసుకున్న వాగ్వివాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. లత అనే మహిళ తన కుమారుడు రాజేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ ఆలయానికి వెళ్లి, పూజాసామగ్రిని ఆలయ పూజారి దర్శన్ చేతికి ఇచ్చింది. ఆయనను అర్చన చేయమని కోరగా, ఆయన కొబ్బరికాయ కొట్టకుండా తిరిగి ఇచ్చేశాడు. కొబ్బరికాయ కొట్టాలని చెప్పిన వినిపించుకోలేదు. దీంతో పూజారిని లత ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అంతలోనే అదుపుతప్పిన పూజారి దర్శన్‌ ఆమె చెంపపై కొట్టాడు. స్థానికంగా ఉన్నవారంతా ఘటనను తీవ్రంగా ఖండించారు. పూజారి తీరుపై అందరూ మండిపడ్డారు.. అక్కడే ఉన్న కొంతమంది జరిగిన ఘటనపై వీడియో తీయడంతో అదిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.