‘ఆగ్రా’ సిటీ పేరును మార్చేయబోతున్నారు..!

దశాబ్దాల క్రితం నుంచి చలామణీలో ఉన్న ఊర్లు, నగరాల పేర్లను మార్చేసి.. వాటికి కొత్త పేర్లు పెట్టడం ఇప్పుడు రివాజుగా మారింది. ఈ పేర్ల మార్పిడి వ్యవహారంలో ఎవరి వాదన వారిది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌ సీఎంగా యోగి ఆదిత్యనాధ్ బాధ్యతలను చేపట్టిన దగ్గర నుంచి అనేక నగరాల పేర్లను మార్చేశారు. అలహాబాద్‌ను ‘ప్రయాగ్‌రాజ్’గా.. గుర్‌గావ్‌ను ‘గురుగ్రామ్‌’గా..  ఫైజాబాద్‌ను ‘అయోధ్య’గా మార్చిన సంగతి విదితమే. […]

'ఆగ్రా' సిటీ పేరును మార్చేయబోతున్నారు..!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 19, 2019 | 12:20 AM

దశాబ్దాల క్రితం నుంచి చలామణీలో ఉన్న ఊర్లు, నగరాల పేర్లను మార్చేసి.. వాటికి కొత్త పేర్లు పెట్టడం ఇప్పుడు రివాజుగా మారింది. ఈ పేర్ల మార్పిడి వ్యవహారంలో ఎవరి వాదన వారిది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌ సీఎంగా యోగి ఆదిత్యనాధ్ బాధ్యతలను చేపట్టిన దగ్గర నుంచి అనేక నగరాల పేర్లను మార్చేశారు. అలహాబాద్‌ను ‘ప్రయాగ్‌రాజ్’గా.. గుర్‌గావ్‌ను ‘గురుగ్రామ్‌’గా..  ఫైజాబాద్‌ను ‘అయోధ్య’గా మార్చిన సంగతి విదితమే. ఇక ఇప్పుడు అదే వరుసలోకి ఆగ్రా సిటీ వచ్చింది.

ప్రేమకు చిహ్నంగా నిలిచే ‘తాజ్‌మహల్’కు కేర్ అఫ్ అడ్రెస్ అయిన ‘ఆగ్రా’ను ‘ఆగ్రావన్’గా మార్చాలని యోగీ సర్కార్ యోచిస్తోందని సమాచారం. దీనిపై డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధ్యయనం మొదలుపెట్టిందట. ఇక ఈ విషయాన్ని ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆగ్రా నగరానికి పూర్వం మరేదైనా పేరు ఉందా.? దానికి చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా.? అనే అంశాలపై రీసెర్చ్ చేయాలంటూ ప్రభుత్వం నుంచి తమకు లేఖ వచ్చిందని ఆయన అన్నారు. అంతేకాకుండా దీనిపై పూర్తిగా పరిశోధనలు చేసి.. ప్రభుత్వానికి త్వరలోనే నివేదికను అందజేస్తామని తెలిపారు. ఇక ఇదంతా చూస్తుంటే.. త్వరలోనే ఆగ్రా సిటీ పేరు మారనుందన్నట్లు తెలుస్తోంది.