ఎస్బీఐ న్యూ రూల్స్: ఖాతాల్లో మినిమమ్ బ్యాలన్స్ లేకపోతే భారీ పెనాల్టీలు తప్పవు!

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా..? అందులో మినిమమ్ బ్యాలన్స్ ఉంచుతున్నారా.? అసలు ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా భారీ పెనాల్టీలు తప్పవు. ప్రభుత్వ రంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా’ అకౌంట్లలో కనీస నగదు నిల్వలపై కొత్త రూల్స్‌ను నవంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డి), రికరింగ్ డిపాజిట్(ఆర్‌డి) వంటి అకౌంట్లను కస్టమర్లకు అందిస్తున్న ఎస్బీఐ.. వారి ఖాతాల్లో మినిమమ్ బ్యాలన్స్ మెయింటైన్ చేయకపోతే భారీ జరిమానాలను విధిస్తోంది. తాజాగా […]

  • Updated On - 2:23 am, Tue, 19 November 19
ఎస్బీఐ న్యూ రూల్స్: ఖాతాల్లో మినిమమ్ బ్యాలన్స్ లేకపోతే భారీ పెనాల్టీలు తప్పవు!

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా..? అందులో మినిమమ్ బ్యాలన్స్ ఉంచుతున్నారా.? అసలు ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా భారీ పెనాల్టీలు తప్పవు. ప్రభుత్వ రంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా’ అకౌంట్లలో కనీస నగదు నిల్వలపై కొత్త రూల్స్‌ను నవంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది.

ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డి), రికరింగ్ డిపాజిట్(ఆర్‌డి) వంటి అకౌంట్లను కస్టమర్లకు అందిస్తున్న ఎస్బీఐ.. వారి ఖాతాల్లో మినిమమ్ బ్యాలన్స్ మెయింటైన్ చేయకపోతే భారీ జరిమానాలను విధిస్తోంది. తాజాగా సేవింగ్స్ అకౌంట్లలో లక్ష కంటే తక్కువ మొత్తంలో నగదును నిల్వ ఉంచుకుంటున్న కస్టమర్ల డిపాజిట్లపై వడ్డీ రేటును 3.25 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే సేవింగ్స్ అకౌంట్ ఉన్నవాళ్లు ప్రతీ నెల ఉంచుకోవాల్సిన కనీస నిల్వను నాలుగు బ్రాంచులుగా ఎస్బీఐ విభజించింది. దీంతో తాజాగా సవరించబడిన రూల్స్ ప్రకారం కస్టమర్లు ఇకపై తమ ఖాతాల్లో మంత్లీ యావరేజ్ బ్యాలన్స్ దాదాపు రూ.1000 నుంచి రూ.3000 ఉంచుకోవాలి.

అంతేకాక ఈ రూల్ ఒక్కో సిటీ బ్రాంచుకు ఒక్కోలా ఉంది. మెట్రో లేదా సెమీ అర్బన్ బ్రాంచ్ అకౌంట్ హోల్డర్స్‌కు కనీస నగదు నిల్వను రూ.3000గా ఫిక్స్ చేశారు. ఇకపోతే సెమీ అర్బన్ బ్రాంచుల్లో రూ.2000.. రూరల్ బ్రాంచ్‌లో అకౌంట్ వినియోగదారులకు నెలవారీ మినిమమ్ బ్యాలన్స్‌ను రూ.1000గా ఖరారు చేశారు. ఇక ఈ మొత్తాన్ని ఎవరైతే నిల్వ చెయ్యరో.. వారు భారీ పెనాల్టీలు చెల్లించక తప్పదని ఎస్బీఐ అధికారులు హెచ్చరించారు.

సవరించబడిన రూల్స్‌ను ఒకసారి చూడండి.. 

Metro and urban branch (required MAB Rs. 3,000) Charges
Shortfall <= 50% Rs. 10 + GST
Shortfall > 50-75% Rs. 12 + GST
Shortfall > 75% Rs. 15 + GST
Semi-urban branch (required MAB Rs. 2,000)
Shortfall <= 50% Rs. 7.50 + GST
Shortfall > 50-75% Rs. 10 + GST
Shortfall > 75% Rs.12 + GST
Rural (required MAB Rs. 1,000)
Shortfall <= 50% Rs. 5 + GST
Shortfall > 50-75% Rs. 7.50 + GST
Shortfall > 75% Rs. 10 + GST

గమనిక: పైన ప్రస్తావించి రూల్స్.. శాలరీల అకౌంట్లకు, బేసిక్ సేవింగ్స్ అకౌంట్లకు, చిన్న మొత్తంలో నగదు దాచుకున్న వారికి, జన్‌ధన్ స్కీములు మొదలగున పథకాల కోసం ఖాతాలు తెరుచుకున్న వారికి ఈ పెరిగిన ఛార్జీలు వర్తించవు.