President Of India: రాష్ట్రపతి ఆవిష్కరించింది నేతాజీ చిత్రపటం కాదా?.. నెటిజన్ల విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేతలు..
President Of India: దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగనాూ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలియని వారుండరు.
President Of India: దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగనాూ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలియని వారుండరు. అంతటి మహానుభావుని ఫోటో విషయంలో ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. అది కూడా దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించిన చిత్రపటంపై విమర్శలు వ్యక్తమవుతోంది. జనవరి 23వ తేదీన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో నేతాజీ చిత్రపటాన్ని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. దానికి సంబంధించిన ఫోటోను రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను గమనించిన పలువురు నెటిజన్లు ఈ చిత్రపటం నేతాజీకి కాదని, ఓ సినీ నటుడిని అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ఫోటోలో ఉన్నది బెంగాలీ నటుడు ప్రొసెంజిత్ చటర్జీ అంటూ సినిమా తాలూకు చిత్రాలను కామెంట్ చేస్తున్నారు.
నేతాజీ సుబాష్ చంద్రబోస్ జీవత కథ ఆధారంగా 2019లో బెంగాలీలో ‘గుమ్నమీ’ అనే సినిమా వచ్చింది. ఆ చిత్రంలో ప్రొసెంజిత్ చటర్జీ.. సుభాష్ చంద్రబోస్ పాత్ర పోషించాడు. అందులో ఆయన చిత్రపటం అచ్చం నేతాజీని పోలినట్లే ఉంటుంది. ఆ చిత్రపటానే ఇప్పుడు రాష్ట్రపతి ఆవిష్కరించారంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. నేతాజీకి, నటుడికి తేడా తెలియడం లేదా? అంటూ రాష్ట్రపతి భవన్ అధికారులకు తీరును తప్పుబడుతున్నారు. కాగా, ఈ ట్రోల్స్‌పై బీజేపీ నేతలు స్పందించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించిన నేతాజీ చిత్రపటాన్ని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు అందజేశారని చెప్పుకొస్తున్నారు. కొందరు కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
President of India
President Kovind unveils the portrait of Netaji Subhas Chandra Bose at Rashtrapati Bhavan to commemorate his 125th birth anniversary celebrations. pic.twitter.com/Y3BnylwA8X
— President of India (@rashtrapatibhvn) January 23, 2021
Also read:
Pangolin smuggling: మంచిర్యాల జిల్లాలో అలుగును పట్టారు.. కోటిన్నరకు బేరం పెట్టారు.. చివరకు