జాతీయ వైద్య కమిషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర

జాతీయ వైద్య కమిషన్‌ బిల్లుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ స్థానంలో తీసుకొచ్చిన జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బిల్లుకు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇది ఇక చట్టం అయింది. త్వరలోనే గెజిట్‌లో నోటిఫై చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ తెలిపారు. అనంతరం నిబంధనల రూపకల్పన తదితర అంశాలను 6 నెలల్లో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, పార్లమెంటు ఉభయ సభలూ […]

జాతీయ వైద్య కమిషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 09, 2019 | 11:03 AM

జాతీయ వైద్య కమిషన్‌ బిల్లుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ స్థానంలో తీసుకొచ్చిన జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బిల్లుకు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇది ఇక చట్టం అయింది. త్వరలోనే గెజిట్‌లో నోటిఫై చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ తెలిపారు. అనంతరం నిబంధనల రూపకల్పన తదితర అంశాలను 6 నెలల్లో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, పార్లమెంటు ఉభయ సభలూ ఎన్‌ఎంసీ బిల్లును ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, బిల్లుపై ఆందోళనలు జరుగుతున్న విషయంపై మంత్రి స్పందించారు. బిల్లులోని వివిధ అంశాలను వైద్య విద్యార్థులు, రెసిడెంట్‌ డాక్టర్లు సరిగా అర్థం చేసుకోలేదని, కొన్ని రూల్స్ పట్ల అనుమానాలతో ఉన్నారన్నారు. వారి అనుమానాలను తాను నివృత్తి చేసినట్లు మంత్రి చెప్పారు.