దారుణం.. మొబైల్ చోరీ చేశాడని తలక్రిందులుగా చెట్టుకు వేలాడదీసి..

కనీసం మానవత్వం ఏకోశానా లేకుండా ప్రవర్తిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సెల్‌ఫోన్ దొంగిలించాడనే చిన్న కారణంతో ఓ వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి దారుణంగా హింసించిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో చోటుచేసుకుంది. సిడ్కుల్ ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది. స్ధానిక హజారా గ్రాంట్ అనే గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన మొబైల్ ఫోన్‌ను జుల్ఫాన్ అనే వ్యక్తి దొంగిలించాడు. దీంతో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఇలా చెట్టుకు వేలాడదీసి తీవ్రంగా […]

దారుణం.. మొబైల్ చోరీ చేశాడని తలక్రిందులుగా చెట్టుకు వేలాడదీసి..

కనీసం మానవత్వం ఏకోశానా లేకుండా ప్రవర్తిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సెల్‌ఫోన్ దొంగిలించాడనే చిన్న కారణంతో ఓ వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి దారుణంగా హింసించిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో చోటుచేసుకుంది. సిడ్కుల్ ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది.

స్ధానిక హజారా గ్రాంట్ అనే గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన మొబైల్ ఫోన్‌ను జుల్ఫాన్ అనే వ్యక్తి దొంగిలించాడు. దీంతో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఇలా చెట్టుకు వేలాడదీసి తీవ్రంగా హింసంచడం స్ధానికంగా కలకలం రేగింది. ఈ దుశ్చర్యకు పాల్పడ్డవారు ఇద్దరూ ఒకే వర్గానికి చెందినవారని, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో వెంటనే స్పందించినట్టు పోలీసులు తెలిపారు.
గత వారంలో కూడా ఓ వ్యక్తిని ఇలాగే తీవ్రంగా కొట్టడంతో మరణించిన విషయం తెలిసిందే.