PMMSY Scheme: రైతులకు గుడ్న్యూస్.. ఈ స్క్రీమ్తో వారికి అనేక ప్రయోజనాలు.. అదేంటంటే..
Pradhan Mantri Matsya Sampada Yojana: అన్నదాతలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పథకాన్ని ప్రారంభించింది. రైతుల ఆర్థిక పరిస్థితిని
Pradhan Mantri Matsya Sampada Yojana: అన్నదాతలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పథకాన్ని ప్రారంభించింది. రైతుల ఆర్థిక పరిస్థితిని పెంచేందుకు కేంద్రం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మత్స్య రంగ అభివృద్ధి కోసం కేంద్రం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారంచుట్టారు. పంటల ద్వారా రైతులకు లబ్ధి కంటే.. ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. ఇతర ఆదాయ మార్గాలు లేకపోవడంతో రైతులు అప్పులు చేసి మరి పంటలు వేయాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా.. రైతులకు వ్యవసాయం కాకుండా అనేక ఉపాధి అవకాశాలను కల్పించింది. రైతుల ఆదాయం, ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. మీరు కూడా రైతు అయితే ఈ పథకాల ద్వారా మంచి ఆదాయాన్ని పొందాలనుకుంటే.. ప్రధానమంత్రి పథకాలను అనుసరించి ప్రయోజనం పొందవచ్చు. వాటిల్లో ఒకటి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకానికి రైతులు అర్హులు. దీనిద్వారా చెరువులు, హేచరీలు, దాణా యంత్రాలు, నాణ్యత పరీక్ష ల్యాబ్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి వస్తుంది. దీనితో పాటు, చేపల పెంపకం, వాటి రక్షణ కోసం ఏర్పాట్లు కూడా చేస్తారు. కొత్త మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ రైతులకు రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్, బయోఫ్లోక్, ఆక్వాపోనిక్స్, ఫిష్ ఫీడ్ మెషీన్లు, ఎయిర్ కండిషన్డ్ వెహికల్స్, ఫిష్ కీపింగ్ లాంటివి సమకూరుస్తారు.
ప్రత్యేక ప్రయోజనాలు దీని ద్వారా రైతులు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. కేజ్ చేపల సేద్యం, రంగుల చేప సేద్యం, ప్రమోషన్ అండ్ బ్రాండింగ్, ఫిష్ కీపింగ్ లాంటి ప్రయోజనాలను అందిస్తారు.
ఇలా అప్లై చేసుకోండి..
దేశంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది . దీనిని నీలి విప్లవం అని కూడా అంటారు. చేపల రైతులు, చేపల విక్రయదారులు, స్వయం సహాయక సంఘాలు, చేపల వ్యాపారులు, రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిని Pradhan Mantri Matsya Sampada Yojana పోర్టల్‌లో (https://dof.gov.in/pmmsy) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా.. గతేడాది మత్స్య సంపద యోజన స్కీమ్ కింద రూ.1,700 కోట్ల విలువైన పనులను కేంద్రం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ స్కీమ్ 21 రాష్ట్రాల్లో అమలులో ఉంది.
Also Read: