AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Former Protection: రైతు ఉద్యమంపై స్పందించిన పాప్‌ సింగర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన కంగనా..

రైతు ఉద్యమంపై ప్రముఖ అంతర్జాతీయ పాప్‌ సింగర్‌ రిహాన్నా స్పందించారు. రైతు ఉద్యమానికి సంబంధించిన ఓ న్యూస్‌ ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. 'ఈ అంశంపై మనం ఎందుకు...

Former Protection: రైతు ఉద్యమంపై స్పందించిన పాప్‌ సింగర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన కంగనా..
Narender Vaitla
|

Updated on: Feb 03, 2021 | 5:47 AM

Share

Pop Singer Rihanna Tweet About Farmers Protection: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు కీడు చేసేలా ఉన్నాయని వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షకు దిగిన విషయం తెలిసిందే. దాదాపు 70 రోజులకి పైగా కొనసాగుతోన్న ఈ దీక్ష జనవరి 26న ట్రాక్టర్‌ ర్యాలీతో తీవ్రరూపం దాల్చింది. దీంతో ఎలాగైనా రైతుల దీక్షను భగ్నం చేయాలని ఓవైపు ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదంటూ రైతులు పట్టుదలతో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రైతు ఉద్యమంపై ప్రముఖ అంతర్జాతీయ పాప్‌ సింగర్‌ రిహాన్నా స్పందించారు. రైతు ఉద్యమానికి సంబంధించిన ఓ న్యూస్‌ ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ అంశంపై మనం ఎందుకు మాట్లాడట్లేదు’ అని క్యాప్షన్‌ జోడించారు.

ఇక రిహాన్నా చేసిన ఈ ట్వీట్‌పై బాలీవుడ్‌ క్వీన్‌, వివాదాస్పద నటి కంగనా రనౌత్‌ తీవ్రంగా స్పందించారు. రిహాన్నా ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ‘ఈ సంఘటన గురించి ఎవరూ మాట్లాడరు కారణం వారు రైతులు కాదు కాబట్టి. వారు దేశాన్ని విభజించాలని చూస్తోన్న ఉగ్రవాదులు’ అంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు కంగనా. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

Also Read: Central Govt: వైద్యుల ఆందోళనలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. అసలు విషయం ఏంటంటే..