Nupur Sharma: నుపుర్ శర్మ ఎక్కడ? తీవ్రంగా గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలు..!

|

Jun 19, 2022 | 5:40 AM

Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలతో మతపరమైన దుమారానికి కారణమైన నుపుర్ శర్మ ఎక్కడ ఉంది? పోలీసులకు చిక్కకుండా ఆమె ఎక్కడ దాక్కున్నట్టు?

Nupur Sharma: నుపుర్ శర్మ ఎక్కడ? తీవ్రంగా గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలు..!
Nupur Sharma
Follow us on

Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలతో మతపరమైన దుమారానికి కారణమైన నుపుర్ శర్మ ఎక్కడ ఉంది? పోలీసులకు చిక్కకుండా ఆమె ఎక్కడ దాక్కున్నట్టు? ఎవరికీ అంతుచిక్కడం లేదు. నుపుర్ శర్మ.. కొద్ది రోజులుగా ఈ పేరు దేశంలో సంచలనంగా మారింది. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా నిలిచారు. ఆమె వ్యాఖ్యలతో దేశంలో పెద్ద దుమారమే రేగింది. అంతర్జాతీయంగా ముస్లిం దేశాలు సైతం ఆమె వైఖరిపై మండిపడ్డాయి. నుపుర్ శర్మ క్షమాపణ చెప్పినప్పటికీ ఈ వివాదం చల్లారలేదు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ముస్లిం సమాజం డిమాండ్ చేస్తోంది. అంతే కాకుండా కేసులు కూడా పెట్టారు. రజా అకాడమీ జాయింట్ సెక్రటరీ ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను ప్రశ్నించేందుకు ఢిల్లీ వెళ్లిన ముంబయి పోలీసులకు నుపుర్ శర్మ ఆచూకీ లభించడంలేదు. ఐదు రోజులుగా హస్తినలో నుపుర్ కోసం గాలిస్తూనే ఉన్నారు. కానీ ఆమె ఆచూకీ దొరకలేదు.

ఖతార్‌, కువైట్‌, ఇరాన్‌లతోపాటు సౌదీఅరేబియా, బహ్రెయిన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ సహా పలు దేశాలు నుపుర్ వ్యాఖ్యలను ఖండించాయి. 57 దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఇస్లామిక్‌ సహకార సంస్థ జనరల్‌ సెక్రెటేరియెట్‌ భారత్‌లో ముస్లింల హక్కుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేసింది. తాజాగా అమెరికా సైతం ఈ అంశంపై స్పందించింది. మానవ హక్కులపై గౌరవాన్ని పెంపొందించుకోవాలని భారత్‌ను ప్రోత్సహిస్తున్నాం అంటూ హితబోధ చేసింది. దీంతో ప్రత్యేక బృందాలు ఆమె కోసం గాలిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ అబుల్ సోహైల్ ఫిర్యాదు ఆధారంగా కోల్‌కతా పోలీసులు సైతం నుపుర్‌ శర్మపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదు చేసేందుకు కోల్‌కతా పోలీసులు జూన్ 20న సమన్లు జారీ చేశారు. ఢిల్లీలోని ఓ పోలీసస్టేషన్‌లోనూ కేసులు నమోదయ్యాయి. కానీ ఎవరికీ నుపుర్ దొరకడం లేదు.