PM Modi: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కాశ్మీర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. ప్రసంగంపై ఉత్కంఠ..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరామం లేకుండా దేశమంతా చుట్టేస్తున్నారు. నెల రోజుల నుంచి తీరిక లేకుండా ప్రధాని పర్యటనలు కొనసాగుతున్నాయి. నిన్న పశ్చిమబెంగాల్‌లో ఇవాళ మరో రాష్ట్రంలో పర్యటించనున్నారు. నేడు శ్రీనగర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరామం లేకుండా దేశమంతా చుట్టేస్తున్నారు. నెల రోజుల నుంచి తీరిక లేకుండా ప్రధాని పర్యటనలు కొనసాగుతున్నాయి. నిన్న పశ్చిమబెంగాల్‌లో ఇవాళ మరో రాష్ట్రంలో పర్యటించనున్నారు. నేడు శ్రీనగర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రధాని మోదీ.. 370 ఆర్టికల్ రద్దు తరువాత ప్రధాని మోదీ తొలిసారిగా కాశ్మీర్‌ను సందర్శించనున్నారు. మోదీ శ్రీనగర్ బక్షీ స్టేడియంలో ‘వికసిత్ భారత్, వికసిత్ జమ్మూ కాశ్మీర్’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు సుమారు రూ. 5000 కోట్లు విలువ చేసే పథకాలను మోదీ ప్రారంభిస్తారు.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. ‘స్వదేశ్ దర్శన్’, ‘ప్రషాద్’ (పిల్‌గ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిట్యువల్ , హెరిటేజ్ ఆగ్‌మెంటేషన్ డ్రైవ్) పథకాల కింద రూ. 1400 కోట్లకు పైగా విలువ చేసే పర్యాటక రంగానికి సంబంధించిన దేశవ్యాప్త ప్రాజెక్టులను మోడీ ప్రారంభిస్తారు. వీటిలో శ్రీనగర్‌లోని హజ్రత్‌బల్ మందిరం సమీకృత అభివృద్ధి ప్రాజెక్ట్ కూడా ఉన్నది.
దీంతోపాటు.. 6,400 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు.. కాశ్మీర్‌లో సమగ్ర అభివృద్ధి దిశగా సమిష్టి కృషిని నొక్కిచెబుతూ, ప్రాంతం పురోగతి, మౌలిక సదుపాయాలను పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తాయని అధికారవర్గాలు తెలిపాయి.
జమ్మూ కాశ్మీర్‌లో కొత్తగా ఎంపికైన సుమారు వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ నియామక పత్రాలను కూడా అందజేయనున్నారు అంతేకాకుండా.. మహిళలు, రైతులు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులతో ఆయన చర్చించనున్నారు.
అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడం..జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించాలని ప్రతిపక్షాలు కోరుతుండడంతో ఇవాళ్టి ప్రధాని మోదీ.. పర్యటన రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఏమి చెబుతారోనని జనం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
భారీగా భద్రతా..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీనగర్ పర్యటన నేపథ్యంలో డ్రోన్‌లు, క్వాడ్‌కాప్టర్ల ఎగరడంపై తాత్కాలికంగా నిషేధం విధించారు. శ్రీనగర్‌ను తాత్కాలిక రెడ్ జోన్ గా ప్రకటించినట్లు శ్రీనగర్ పోలీసులు ప్రకటించారు. పౌరులు తాత్కాలిక నిషేధానికి సహకరించాలని కోరారు. అంతేకాకుండా.. భారీగా బలగాలను మోహరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
