AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: డే వన్‌ నుంచే లాభం పొందాలనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయండి తిరుగుండదు!

చాలామందికి తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనే కోరిక ఉంటుంది. వైన్ షాపుల ముందు బిర్యానీ పాయింట్ ప్రారంభించడం ద్వారా డే వన్ నుంచే లాభాలు ఆర్జించవచ్చు. హైదరాబాద్ దమ్ బిర్యానీని రుచి, నాణ్యతతో రూ.99కే అందిస్తూ, కేవలం రూ.20,000తో ఈ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు.

Business Idea: డే వన్‌ నుంచే లాభం పొందాలనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయండి తిరుగుండదు!
Gratuity
SN Pasha
|

Updated on: Feb 11, 2026 | 7:30 AM

Share

చాలా మందికి ఓ మంచి బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలనే కోరిక, కల ఉంటుంది. కానీ ఎందుకో సరైన కారణం లేకపోయాన వెనకడుగు వేస్తుంటారు. బిజినెస్‌ అంటే రిస్క్‌తో కూడుకున్నది, ముందు భారీగా పెట్టుబడి పెట్టి, రిటన్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం చాలా కాలం ఎదురుచూడాలని అనుకుంటారు. కానీ, కొన్ని రకాల బిజినెస్‌లు ఎలా ఉంటాయంటే డే వన్‌ నుంచే మీరు లాభం చూడొచ్చు. అలాంటి ఓ బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఫుడ్‌ బిజినెస్‌ ఎప్పుడూ డిమాండ్‌ ఉండే బిజినెస్‌. అయితే సరైన చోట పెట్టాలని కానీ ఫుడ్‌ బిజినెస్‌ మూడు పువ్వులు, ఆరు కాయలుగా దూసుకెళ్తుంది. ఇప్పుడు ఓ బిర్యాని పాయింట్‌ స్టార్ట్‌ చేయడం గురించి మాట్లాడుకుంటే.. మీరు కాస్త పెట్టుబడి పెట్టి, ఓ వైన్‌ షాప్‌ ముందు బిర్యాని పాయింట్‌ కనుక స్టార్ట్‌ చేస్తే మంచి బిజినెస్‌ పాయింట్‌ అవుతుంది. ఎందుకంటే.. మద్యం సేవించిన వాళ్లు నాన్‌ వెజ్‌ తినేందుకు బాగా ఇష్టపడతారు. అందులోనూ హైదరాబాద్‌ దమ్‌ బిర్యాని అంటే చాలా మంది ఇష్టపడతారు.

మంచి రుచి, నాణ్యత, తక్కువ ధరలో మీరు ఓ వైన్‌ షాప్‌ ముందు బిర్యాని పాయింట్‌ పెట్టుకుంటే కచ్చితంగా మంచి ప్రాఫిట్స్‌ చూడొచ్చు. అయితే ఇందుకోసం మీరు సరిగ్గా వైన్‌ షాప్‌ ఎదురుగానో లేక పక్కనో ఒక మంచి రూమ్‌ రెంట్‌కి తీసుకోవాలి. అక్కడే బిర్యాని ప్రిపేర్‌ చేసే అవకాశం ఉంటే ఇంకా మంచిది. లేదంటే ఇంటి దగ్గర వండి అయినా అక్కడి తీసుకురావొచ్చు. ప్లేటు బిర్యాణి రూ.99లకే అందించగలిగితే ఇంకా బెటర్‌ సేల్‌ ఉంటుంది. మీకు బిర్యాని చేయడం వస్తే సూపర్‌, లేదంటే ఓ మంచి మాస్టర్‌ను మాట్లాడుకోవచ్చు. ఈ బిజినెస్‌ స్టార్‌ చేయడానికి రూమ్‌కి అడ్వాన్స్‌, బిర్యాని సామాన్‌, కూర్చిలు, టేబుల్స్‌ కోసం మాత్రం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తం ఓ రూ.20 వేలతో మీరు ఈ బిర్యాని పాయింట్‌ స్టార్‌ చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి