Quinton De Kock : ధోనీ రికార్డు సమం చేసిన డికాక్.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో సఫారీ కీపర్!
Quinton De Kock : టీ20 వరల్డ్ కప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో పరుగుల వర్షం కురుస్తుంటే, వికెట్ల వెనుక రికార్డులు బద్దలవుతున్నాయి. తాజాగా సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ భారత దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నెలకొల్పిన ఒక అరుదైన ప్రపంచ రికార్డును సమం చేశాడు.

Quinton De Kock : టీ20 వరల్డ్ కప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో పరుగుల వర్షం కురుస్తుంటే, వికెట్ల వెనుక రికార్డులు బద్దలవుతున్నాయి. తాజాగా సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ భారత దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నెలకొల్పిన ఒక అరుదైన ప్రపంచ రికార్డును సమం చేశాడు. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదిలిన డికాక్, ధోనీ రికార్డును చెరిపేయడానికి కేవలం అడుగు దూరంలో నిలిచాడు.
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ వికెట్ల వెనుక రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. దీనితో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధికంగా 32 మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న రికార్డును డికాక్ సమం చేశాడు. ధోనీ తన కెరీర్‌లో 33 మ్యాచ్‌ల్లో 32 డిస్మిసల్స్ చేయగా, డికాక్ ఇప్పుడు అదే మార్కును చేరుకున్నాడు. తదుపరి మ్యాచ్‌లో మరో ఒక్క అవుట్ చేస్తే, ధోనీని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నంబర్ 1 వికెట్ కీపర్‌గా డికాక్ చరిత్ర సృష్టించనున్నాడు.
టీ20 క్రికెట్ – టాప్ వికెట్ కీపర్ల జాబితా
క్వింటన్ డికాక్ (సౌత్ ఆఫ్రికా): 32 డిస్మిసల్స్
ఎంఎస్ ధోనీ (భారత్): 32 డిస్మిసల్స్
కామ్రాన్ అక్మల్ (పాకిస్థాన్): 30 డిస్మిసల్స్
దినేష్ రామ్ దిన్ (వెస్టిండీస్): 27 డిస్మిసల్స్
కుమార సంగక్కర (శ్రీలంక): 26 డిస్మిసల్స్
కెనడాపై సౌతాఫ్రికా భారీ విజయం
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రామ్ 59 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో డేవిడ్ మిల్లర్ (39 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (34 నాటౌట్) మెరుపులు మెరిపించారు. కెనడా బౌలర్ అన్ష్ పటేల్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. కెనడా ఓపెనర్ నవనీత్ ధలివాల్ 64 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, మిగిలిన బ్యాటర్లు ఎవరూ అండగా నిలవలేదు. ఫలితంగా సౌతాఫ్రికా 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
