AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయే సౌండ్, ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఇయర్‌‌బడ్స్..! ధర తెలిస్తే షాకవుతారు

హువావే తన లేటెస్ట్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌తో భారత మార్కెట్లో సందడి చేయడానికి సిద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో సక్సెస్ సాధించిన హువావే ఫ్రీబడ్స్ 7i, ఫ్రీబడ్స్ SE 4 ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అద్భుతమైన నాయిస్ క్యాన్సిలేషన్, భారీ బ్యాటరీ లైఫ్ మరియు ప్రీమియం డిజైన్‌తో వస్తున్న ఈ కొత్త మోడల్స్ గురించి, వాటి ధరల గురించి తెలుసుకుందాం.

అదిరిపోయే సౌండ్, ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఇయర్‌‌బడ్స్..! ధర తెలిస్తే షాకవుతారు
Huawei Launches Freebuds 7i And Se 4.jpg
Nikhil
|

Updated on: Jun 19, 2026 | 8:10 PM

Share

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్! హువావే నుండి రెండు సరికొత్త ఇయర్‌బడ్స్ మోడల్స్ జూన్ 18న అధికారికంగా విడుదల కానున్నాయి. ప్రీమియం సౌండ్ క్వాలిటీ కోసం ఫ్రీబడ్స్ 7i, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోసం ఫ్రీబడ్స్ SE 4 మోడల్స్ ప్లాన్ చేశారు. ఈ కొత్త గ్యాడ్జెట్ల ప్రత్యేకతలేమిటి, ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ డివైజ్‌లతో ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం!

హువావే ఫ్రీబడ్స్ 7i

ప్రీమియం లుక్, అద్భుతమైన ఫీచర్లు కోరుకునే వారికి ‘హువావే ఫ్రీబడ్స్ 7i’ ఒక సరైన ఎంపిక. దీని ధర రూ. 13,999గా నిర్ణయించారు. ఇది పింక్, వైట్, బ్లాక్ రంగులలో లభిస్తుంది. ఇందులో ఉన్న 11 మిమీ క్వాడ్ మాగ్నెట్ డైనమిక్ డ్రైవర్ అత్యుత్తమ సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. ముఖ్యంగా ‘ఇంటెలిజెంట్ డైనమిక్ ఏఎన్‌సీ 4.0’ టెక్నాలజీ బయటి శబ్దాలను పూర్తిగా అడ్డుకుంటుంది.

బోన్ కండక్షన్ మైక్రోఫోన్, ఏఐ కాల్ నాయిస్ రిడక్షన్ వల్ల కాల్స్ స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. కేవలం 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే ఈ బడ్స్, కేస్‌తో కలిపి 35 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తాయి. ఐపీ54 రేటింగ్‌తో నీటి చినుకుల నుండి కూడా ఇవి రక్షణ పొందుతాయి. తల ఊపడం ద్వారా కాల్స్ నియంత్రించే వినూత్న గెస్టర్ కంట్రోల్స్ ఇందులో ఉండటం ప్రత్యేక ఆకర్షణ.

బడ్జెట్ ధరలో ఫ్రీబడ్స్ SE 4

తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లు కోరుకునే వారి కోసం ‘ఫ్రీబడ్స్ SE 4’ అందుబాటులోకి రానుంది. దీని ధర కేవలం రూ. 7,999 మాత్రమే. ఇది వైట్, బ్లాక్ రంగులలో లభిస్తుంది. 10 వేల మంది చెవుల ఆకృతిని పరిశీలించి, ఎంతో సౌకర్యవంతంగా దీన్ని డిజైన్ చేశారు. 10 మిమీ డైనమిక్ డ్రైవర్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ దీనికి అదనపు బలం.

ఈ మోడల్ బ్యాటరీ లైఫ్ పరంగా ఆశ్చర్యపరుస్తుంది. ఏఎన్‌సీ ఆపకపోతే కేస్‌తో కలిపి 50 గంటల భారీ బ్యాటరీ లైఫ్‌ను ఇది అందిస్తుంది. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఉండటం వల్ల డివైజ్‌లతో చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది. టచ్ కంట్రోల్స్ ద్వారా పాటలను మార్చుకోవడం, కాల్స్ మాట్లాడటం ఎంతో సులభం. మీరు బడ్జెట్ ధరలో ఎక్కువ బ్యాటరీ లైఫ్, నాణ్యమైన సౌండ్ కావాలనుకుంటే, ఫ్రీబడ్స్ SE 4 మీకు ఉత్తమమైన ఛాయిస్. ఫ్లిప్‌కార్ట్, ఆర్‌టీసీ ఇండియా అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మీరు వీటిని కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఈ మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి, కాబట్టి మీ మ్యూజిక్ అనుభవాన్ని మెరుగుపరుచుకోవడానికి సిద్ధం కండి!

Follow Us
కుతుబ్‌షాహీల నుంచి తెలంగాణ వరకు.. కాలంతో పాటు ఎదిగిన మహానగరం
కుతుబ్‌షాహీల నుంచి తెలంగాణ వరకు.. కాలంతో పాటు ఎదిగిన మహానగరం
బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా..
బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా..
అమెజాన్‌లో ఫ్రీడమ్ సేల్.. ఫోన్‌ల నుండి ఏసీల వరకు 80 శాతం తగ్గింపు
అమెజాన్‌లో ఫ్రీడమ్ సేల్.. ఫోన్‌ల నుండి ఏసీల వరకు 80 శాతం తగ్గింపు
జాతకాలను ఎక్కువగా నమ్ముతాను.. అందుకే 10 వేలు ఖర్చు చేస్తా..
జాతకాలను ఎక్కువగా నమ్ముతాను.. అందుకే 10 వేలు ఖర్చు చేస్తా..
విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందా?
విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందా?
ప్రజలు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారు.. రంగం భవిష్యవాణి ఇదే
ప్రజలు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారు.. రంగం భవిష్యవాణి ఇదే
భారీ సైజులో ఉన్న ఆవులకు ఎంత రేటు చెబున్నారంటే..?
భారీ సైజులో ఉన్న ఆవులకు ఎంత రేటు చెబున్నారంటే..?
నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్‌చల్.. బండి హారన్లు కొట్టడంతో..
నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్‌చల్.. బండి హారన్లు కొట్టడంతో..
అతి త్వరలో సంపూర్ణ సూర్యగ్రహణం.. వీరికి కష్టాలు ప్రారంభం
అతి త్వరలో సంపూర్ణ సూర్యగ్రహణం.. వీరికి కష్టాలు ప్రారంభం
బోనమెత్తిన టాలీవుడ్ హీరోయిన్..
బోనమెత్తిన టాలీవుడ్ హీరోయిన్..