PM Narendra Modi: ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు పురాతన విగ్రహాలు.. ప్రధాని మోడీ ఏమన్నారంటే..?

|

Mar 21, 2022 | 8:57 PM

PM Modi - Australia: కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాల్లో ఉన్న భారత విగ్రహాలను వెనెక్కి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల నుంచి వేలాది ఏళ్ల నాటి విగ్రహాలను స్వదేశానికి తీసుకొచ్చింది.

PM Narendra Modi: ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు పురాతన విగ్రహాలు.. ప్రధాని మోడీ ఏమన్నారంటే..?
Pm Modi
Follow us on

PM Modi – Australia: కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాల్లో ఉన్న భారత విగ్రహాలను వెనెక్కి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల నుంచి వేలాది ఏళ్ల నాటి విగ్రహాలను స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియా నుంచి 9-10వ శతాబ్దాలకు చెందిన పురాతన అరుదైన (Antiquities) విగ్రహాలు భారత్‌కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పురాతన అరుదైన 29 విగ్రహాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రధాని నరంద్రమోడీ ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మోరిసన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ – స్కాట్ మోరిసన్ మధ్య ఈరోజు సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా 29 కళాఖండాలను భారతదేశానికి తిరిగి ఇచ్చింది. వర్చువల్ ద్వారా జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ – స్కాట్ మోరిసన్ పలు అంశాలపై చర్చించారు.

ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు తిరిగి చేరిన 29 పురాతన వస్తువులను ప్రధాని మోదీ పరిశీలించారు. ఇతివృత్తాల ప్రకారం ఇవి 6 రూపాల్లో ఉన్నాయి. శివుడు, శివుని శిష్యులు, విష్ణువు, విష్ణు రూపాలు, శక్తి ఆరాధన‌, జైన సంప్రదాయానికి సంబంధించిన చిత్రాలు.. అలంకారణ‌ వస్తువులు ఉన్నాయి. ఈ పురాతన వస్తువులు వివిధ కాలాలకు చెందిన‌వి. భారతదేశంలోని రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ భౌగోళిక ప్రాంతాలకి చెందినవిగా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ట్విట్టర్ లో షేర్ చేశారు.

కాగా.. గత ఏడాది సెప్టెంబరులో పీఎం మోడీ అమెరికా తదితర ప్రాంతాల నుంచి 157 కళాఖండాలు, పురాతన వస్తువులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేలా కృషి చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో ప్రత్యేకంగా సమావేశమై.. దొంగతనం, అక్రమ వ్యాపారం, సాంస్కృతిక వస్తువుల అక్రమ రవాణాను నిరోధించే ప్రయత్నాల గురించి చర్చించారు.

Also Read:

KCR POLITICAL FIGHT: కేంద్రంపై పోరాటం.. బీజేపీతో యుద్ధం.. రెండంశాలపై క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్

BJP: ఉత్తరాఖండ్‌ , గోవాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రులే.. బీజేపీ హైకమాండ్‌ కీలక నిర్ణయం..