PM Modi: సెమీఫైనల్‌లో బీజేపీ గెలిచింది.. ఇక సిక్సర్లు కొట్టండి.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

|

Aug 08, 2023 | 3:26 PM

BJP parliamentary meeting: అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై, మాట్లాడాల్సిన అంశాలను ప్రస్తావించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అని కొందరు అహంకారంతో అన్నారని, సెమీఫైనల్‌లో విజయం సాధించినందుకు ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు.

PM Modi: సెమీఫైనల్‌లో బీజేపీ గెలిచింది.. ఇక సిక్సర్లు కొట్టండి.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
BJP Parliamentary Meeting
Follow us on

BJP parliamentary meeting: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. అంతకుముందు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై ఎంపీలకు పలు సలహాలు సూచనలు చేశారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై, మాట్లాడాల్సిన అంశాలను ప్రస్తావించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అని కొందరు అహంకారంతో అన్నారని, సెమీఫైనల్‌లో విజయం సాధించినందుకు ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే వారు అవినీతి, కుటుంబవాదం, బుజ్జగింపు రాజకీయాలతో సామాజిక న్యాయానికి అతిపెద్ద నష్టం చేస్తున్నారంటూ ప్రధాని మోడీ ఇండియా కూటమిపై మండిపడ్డారు. ఆగస్ట్ 9 నుంచి బీజేపీ మరో క్విట్ ఇండియా నినాదం ఊపందుకుంటుందంటూ పేర్కొన్నారు.

విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం ఇండియా బ్లాక్ పార్టీల మధ్య పరస్పర అవిశ్వాసానికి ప్రతిబింబమంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎందుకంటే వారు తమ ప్రతిపాదనతో ఎవరు ఉన్నారు.. ఎవరు లేరు అని పరీక్షించాలనుకుంటున్నాయంటూ పేర్కొన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమిని ‘ఘమాండియా’ (అహంకారం) తో ఉందని అభివర్ణించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై జరిగిన ఓటింగ్‌ను సెమీఫైనల్‌గా కొందరు ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారని, జాతీయ ఎన్నికల్లో బిజెపికి ఉన్న అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేశారని మోడీ వివరించారు.

ఇవి కూడా చదవండి

అధికార పార్టీకి బలమైన మెజారిటీ ఉన్న లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఓడించడం ఖాయమైనందున, 2024 ఎన్నికలకు ముందు చివరి బంతికి పార్టీ ఎంపీలు “సిక్సర్లు” కొట్టాలటూ ప్రధాని మోడీ సూచించారు.

స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పూర్తికాగానే ప్రతి గ్రామం నుంచి అమృత కలశ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు మోదీ. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రణాళిక ఇందులో ఉందన్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి, ఆ ఇంటి పెద్దకు ఈ ప్రణాళికను ఇవ్వాలని సూచించారు.

ప్రతి గ్రామంలో 75 మొక్కలు నాటాలని బీజేపీ కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు. తర్వాత ఈ కార్యక్రమం తహసిల్, జిల్లా, రాష్ట్ర స్థాయిని దాటుకుని ఢిల్లీకి చేరుకుంటుందన్నారు మోదీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం..