AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divorce Case: భర్త నల్లగా ఉన్నాడని వేధించిన భార్య.. విడాకులు కోరిన భర్త.. కోర్టు ఏం చెప్పిందంటే

కర్ణాటకలోని ఓ యువతీ, యువకుడికి 2007లో వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన తర్వాత వీరిద్దరి బంధంలో మార్పులు వచ్చాయి. నల్లగా, అందవిహీనంగా ఉన్నావంటూ భర్తను భార్య వేధించడం మొదలుపెట్టింది. ఇలా చాలా కాలం పాటు జరిగింది. ఇక భార్య వేధింపులను భర్త తట్టుకోలేకపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నాడు.

Divorce Case: భర్త నల్లగా ఉన్నాడని వేధించిన భార్య.. విడాకులు కోరిన భర్త.. కోర్టు ఏం చెప్పిందంటే
Court Order
Aravind B
|

Updated on: Aug 08, 2023 | 4:46 PM

Share

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఒక మధురమైన ఘట్టం. వివాహం తర్వాత పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి జంట కోరుకుంటుంది. అయితే పెళ్లి తర్వాత గొడవలు రావడం సహజమే. కొంతమంది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాంతం కలిసుంటారు. కానీ మరికొందరు మనస్పర్థలు, గొడవల వల్ల మధ్యలోనే తమ బంధాన్ని బ్రేక్ చేసుకుంటారు. చివరికి విడాకులు తీసుకుంటారు. అలాగే ఇప్పటికీ కూడా ఎక్కడో ఓ చోట గృహ హింస కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. భార్యను భర్త వేధించడం లేదా భర్తను భార్య వేధించడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ భార్య చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భర్త నల్లగా ఉన్నాడని అతడిని వేధించడం చర్చకు దారితీసింది. చివరికి భార్య వేధింపులు తాళలేక భర్త పోలీసులను ఆశ్రయించడంతో అతనికి విముక్తి లభించింది.

ఇక వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని ఓ యువతీ, యువకుడికి 2007లో వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన తర్వాత వీరిద్దరి బంధంలో మార్పులు వచ్చాయి. నల్లగా, అందవిహీనంగా ఉన్నావంటూ భర్తను భార్య వేధించడం మొదలుపెట్టింది. ఇలా చాలా కాలం పాటు జరిగింది. ఇక భార్య వేధింపులను భర్త తట్టుకోలేకపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నాడు. ఓపిక నశించిపోయి పోలీసులను ఆశ్రయించాడు భర్త. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భార్య కూడా తన భర్త పై తప్పుడు కేసు పెట్టింది. 2011లో ఆమె భర్త తనపై, తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులను కూడా చిత్రహింసలకు గురిచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. దీంతో సుమారు వంద రోజుల పాటు పోలీస్ స్టేషన్, కోర్టులో గడిపానని ఆ భర్త ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య, ఆమె తల్లితండ్రులు అసలు ఇంటికి తిరిగి రాలేదని.. దీనివల్ల తాను చాలా బాధపడ్డానని వాపోయాడు.

దీంతో తనకు వెంటనే విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరాడు భర్త. అయితే భర్త వేసిన పిటీషన్ కొట్టివేయాలని భార్య కోర్టుకు విజ్ఞప్తి చేసింది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని.. ఆ సంబంధం వల్ల ఒక బిడ్డ కూడా ఉందని ఆమె ఆరోపణలు చేసింది. అలాగే తన భర్త పరుష పదజాలంతో దూషణలు చేశాడని.. బయటకు వెళ్లినప్పుడు ఆలస్యంగా ఇంటికి వస్తుండేవాడని తెలిపింది. చివరికి కోర్టు ఇరువైపు వాదనలు విచారించి సంచలన తీర్పు వెలువరించింది. భర్తతో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని భార్య చెబుతున్నప్పటికీ కూడా ఆయనపై చేసిన ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోవడం భర్తతో కలిసి ఉండాలనే ఆసక్తి లేనట్లుగా కనిపిస్తోందని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. వర్ణ, జాతి పరంగా భర్తను వేధించడాన్ని న్యాయస్థానం క్రూరత్వంగా పరిగణించింది. చివరికి ఆ భర్తకు భార్య నుంచి విడాకులు మంజూలు చేస్తూ తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి