PM Modi: అవినీతిపరులు భయపడుతున్నారు.. 2014 నుంచి సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోందన్న ప్రధాని మోడీ

అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలక పాత్ర అని.. 2014 నుంచి సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. అవినీతితో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అంటూ మోడీ తెలిపారు. సోమవారం సీబీఐ డైమండ్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi: అవినీతిపరులు భయపడుతున్నారు.. 2014 నుంచి సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోందన్న ప్రధాని మోడీ
Pm Modi

Updated on: Apr 03, 2023 | 1:20 PM

అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలక పాత్ర అని.. 2014 నుంచి సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. అవినీతితో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అంటూ మోడీ తెలిపారు. సోమవారం సీబీఐ డైమండ్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలకపాత్ర అని పేర్కొన్న మోడీ.. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోందన్నారు. అవినీతితో యువతకు చాలా నష్టమంటూ తెలిపారు. సీబీఐ సామాన్యులకు ఆశ, బలాన్ని నింపిందంటూ మోడీ వ్యాఖ్యానించారు. న్యాయం కోసం సీబీఐ బ్రాండ్‌గా అవతరించిందని.. అందుకోసమే.. పలు సంఘటనల్లో సీబీఐ విచారణను డిమాండ్ చేయడానికి ప్రజలు నిరసనలు చేపట్టారంటూ సీబీఐ వజ్రోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు.

సీబీఐ వంటి వృత్తిపరమైన, సమర్థవంతమైన సంస్థలు లేకుండా భారతదేశం ముందుకు సాగదంటూ తెలిపారు. బ్యాంకు మోసాల నుంచి.. వన్యప్రాణులకు సంబంధించిన మోసాల వరకు, సీబీఐ పని పరిధి చాలా రెట్లు పెరిగిందని మోడీ వివరించారు. అయితే సిబిఐ ప్రధాన బాధ్యత.. దేశాన్ని అవినీతి రహితంగా మార్చడమన్నారు.

ఇవి కూడా చదవండి

10 ఏళ్ల కిందట అవినీతి మరింత ఎక్కువ చేసేందుకు పోటీ ఉండేదని.. ఆ సమయంలో పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగాయంటూ మోడీ తెలిపారు. అయినప్పటికీ.. నిందితులు భయపడలేదు.. ఎందుకంటే వ్యవస్థ వారికి అండగా నిలిచిందంటూ మోడీ పేర్కొన్నారు. 2014 తర్వాత, అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా తాము మిషన్ మోడ్‌లో పనిచేశామమని.. దీంతో మార్పు సాధ్యమైందంటూ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ఎవరికి వ్యతిరేకంగా చర్య తీసుకుంటున్నారో వారు చాలా శక్తివంతులని, వారు సంవత్సరాలుగా ప్రభుత్వం, వ్యవస్థలో భాగంగా ఉన్నారని తెలుసు.. అలాంటివారు ఈ రోజు కూడా వారు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు.. అలాంటి వారిపై సిబిఐ దృష్టి పెట్టాలి, అవినీతిపరులను వదిలిపెట్టకూడదంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..