PM Modi: అలాంటి వ్యూహాలతోనే విజయం వరిస్తుంది.. ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Dec 15, 2022 | 9:11 AM

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గత రికార్డులను తిరగరాసింది.. భారతీయ జనతా పార్టీ వరుసగా ఏడోసారి గుజరాత్‌లో అధికారాన్ని సొంతం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యూహాలతో.. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది.

PM Modi: అలాంటి వ్యూహాలతోనే విజయం వరిస్తుంది.. ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు..
Pm Modi

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గత రికార్డులను తిరగరాసింది.. భారతీయ జనతా పార్టీ వరుసగా ఏడోసారి గుజరాత్‌లో అధికారాన్ని సొంతం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యూహాలతో.. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ రికార్డు స్థాయిలో 156 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5 స్థానాలకే పరిమితం అయ్యాయి. కాగా.. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గత రికార్డులన్నీ బద్దలు కొట్టడంపై ప్రధాని మోడీకి అభినందనలు వెల్లువెత్తాయి. బీజేపీ అధిష్టానం సైతం ఈ విజయం ప్రధాని మోడీకే దక్కుతుందని పేర్కొంది. ఢిల్లీలో బుధవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గుజరాత్ విజయాన్ని ప్రస్తావిస్తూ పలువురు నేతలు ప్రధాని నరేంద్ర మోడీని అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర యూనిట్‌పై, ముఖ్యంగా అధ్యక్షుడు సిఆర్‌పాటిల్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఈ విజయం బీజేపీ సంస్థాగత బలమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశం అనంతరం విలేకరులతో పేర్కొన్నారు. ముఖ్యంగా కార్యకర్తల విజయమంటూ పేర్కొన్నారు.. పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉందని పేర్కొన్నారు.

పార్టీ సంస్థ పటిష్టంగా ఉంటే ఎన్నికలలో విజయం ఎలా సాధ్యమో చెప్పేందుకు గుజరాత్‌లోని బీజేపీ యూనిట్‌ను పీఎం మోడీ ఒక ఉదాహరణగా కొనియాడారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బూత్ లెవల్‌లో పార్టీని బలోపేతం చేయడం.. ప్రజల్లో పథకాల గురించి వివరించడం.. ఓట్లను పార్టీకి మలుచుకోవడం లాంటి విషయాలను ప్రధాని మోడీ ప్రస్తావించారు. 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో 156 స్థానాల్లో విజయం సాధించిన తరువాత.. తన సన్నిహితుడైన పాటిల్‌ను ప్రధాని ప్రశంసించడం, పార్టీలో అతని స్థానాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నాయి. కాగా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై కూడా మోదీ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు.

పాటిల్ 2019లో నవ్‌సారి లోక్‌సభ స్థానం నుంచి దాదాపు ఏడు లక్షల ఓట్ల తేడాతో సొంతంగా గెలుపొందడం అప్పట్లో రికార్డుగా ఉంది. దీని వెనుక బూత్ స్థాయి నుంచి చివరి స్థాయి కార్యకర్తలు, వారి ఇళ్ల వరకు పార్టీని బలోపేతం చేసి.. పాటిల్ తనదైన ప్రణాళికతో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే మోడల్‌ను అనుసరించారు. ఇది పార్టీ ఓట్ షేర్‌లో పెరుగుదలకు దారితీసింది. ఇది ప్రతిపక్ష ఓట్లలో చీలికతో పాటు తిరుగులేని మెజారిటీని సాధించడంలో సహాయపడింది.

ఇవి కూడా చదవండి

బీజేపీ తన పనిని, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమైందని, వరుసగా ఏడోసారి విజయం బీజేపీ పాలనై వ్యతిరేకత లేదని నిరూపించిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీఎం మోడీ.. భారతదేశం G-20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడంపై కూడా మాట్లాడారు. వచ్చే ఏడాది జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి ముందు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఎంపీలను కోరారు.

ఈ సమావేశంలో భారత ఆర్థిక వ్యవస్థపై కేంద్ర మంత్రి అశివినీ వైష్ణవ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతర్జాతీయ ప్రచురణలను ఉటంకిస్తూ, టాప్ ఏడు దేశాలలో భారతదేశం ఒకటని.. వివరించారు. గత కొన్ని దశాబ్దాల డేటాను ఉటంకిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాలలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎప్పుడూ ఎక్కువగా ఉందని.. బిజెపి ప్రభుత్వాలలో తక్కువగా ఉందని ప్రజెంటేషన్ లో వివరించారు. గతంతో పోలిస్తే బ్యాంకు రుణాలు పెరిగాయని.. పరిశ్రమలో సామర్థ్య వినియోగం పెరిగిందని ఆయన అన్నారు

మరిన్ని జాతీయ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu