AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా..’.. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌కు ప్రధాని మోదీ అభినందనలు

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా, సింగపూర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని, కలిసి పనిచేయడం కొనసాగించాలని భారతదేశం ఆసక్తిగా ఉందని ప్రధాని అన్నారు. కాగా, సింగపూర్ పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) అఖండ విజయం సాధించాయి. 97 పార్లమెంటరీ స్థానాల్లో 87 స్థానాలను గెలుచుకున్నాయి.

‘కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా..’.. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌కు ప్రధాని మోదీ అభినందనలు
PM Modi, Lawrence Wong
Balaraju Goud
|

Updated on: May 04, 2025 | 12:31 PM

Share

సింగపూర్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లారెన్స్ వాంగ్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వాంగ్ అఖండ విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ, ఆయనతో కలిసి పనిచేయడం కొనసాగించాలని ఎదురుచూస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. శనివారం(మే 03) జరిగిన సింగపూర్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్ పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) అఖండ విజయం సాధించాయి. 97 పార్లమెంటరీ స్థానాల్లో 87 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.

ప్రధానమంత్రి మోదీ తన సోషల్ మీడియా హ్యాండిల్ X లో పోస్ట్ చేస్తూ, “సాధారణ ఎన్నికల్లో సాధించిన ఘన విజయంపై లారెన్స్ వాంగ్ కు హృదయపూర్వక అభినందనలు” అని అన్నారు. భారతదేశం – సింగపూర్ బలమైన, బహుముఖ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. “మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పనిచేయడం కొనసాగించాలని ఎదురుచూస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

పూర్తి ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే, వాంగ్ తన నియోజకవర్గంలోని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మీ బలమైన ఆదేశానికి మేము మరోసారి కృతజ్ఞులమని అన్నారు. మీ అందరి కోసం మరింత కష్టపడి పనిచేయడం ద్వారా మాపై ఉంచిన నమ్మకాన్ని మేము గౌరవిస్తామని వాంగ్ అన్నారు

మాజీ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ తర్వాత వాంగ్ (52) నగర రాష్ట్రానికి నాల్గవ నాయకుడయ్యాడు. లీ 20 సంవత్సరాలు పూర్తి కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. ఆ తరువాత, మే 2024లో, లీ ఈ పదవిని విడిచిపెట్టారు. సీనియర్ మంత్రిగా మంత్రివర్గంలో కొనసాగారు. లీ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవడంతో, సింగపూర్ తొలి నాయకుడు, ఆయన తండ్రి లీ కువాన్ యూ ప్రారంభించిన కుటుంబ వంశపారంపర్యానికి ముగింపు పలికారు.

దీని తరువాత, 20 సంవత్సరాల తర్వాత, 2024 మే 15న, సింగపూర్‌కు కొత్త ప్రధానమంత్రి వచ్చారు. అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగ రత్నం ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ తో దేశ నాల్గవ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధానమంత్రి అయిన తర్వాత వాంగ్ కు ఇది మొదటి ఎన్నిక. దీనిలో ఆయన అఖండ విజయం సాధించి పార్టీ విజయ పరంపరను కొనసాగించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి సింగపూర్‌లో PAP పార్టీ అధికారంలో ఉంది. PAP పార్టీ గత 65 సంవత్సరాలుగా సింగపూర్‌ను పాలిస్తోంది. మరే ఇతర పార్టీ కూడా వారితో పోటీ పడలేకపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..