PM Modi: G7 శిఖరాగ్ర సమావేశం కోసం కెనాడా చేరుకున్న ప్రధాని మోదీ! వీటిపై ప్రధాన చర్చ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడాలోని G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి కెనడాకు వెళ్ళారు. భారత్-కెనడా సంబంధాలు మెరుగుపడటానికి ఇది ఒక అవకాశం. ఈ సమావేశంలో ప్రపంచ సమస్యలపై చర్చలు జరుగుతాయి. ఉగ్రవాదం, AI, క్వాంటం టెక్నాలజీ వంటి అంశాలు ముఖ్యంగా చర్చించబడతాయి.

ఆల్బెర్టాలోని సమీపంలోని కననాస్కిస్‌లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం (స్థానిక సమయం) కాల్గరీ చేరుకున్నారు. కెనడాలో తన 23 గంటల పర్యటన సందర్భంగా మోదీ మంగళవారం సాయంత్రం క్రొయేషియాకు బయలుదేరే ముందు G7 ఔట్రీచ్ సెషన్‌లో ప్రసంగించి, ఆతిథ్య కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో సహా వరుస ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. సమ్మిట్‌లో ప్రధానమంత్రి G-7 దేశాల నాయకులు, ఇతర ఆహ్వానించబడిన ఔట్రీచ్ దేశాలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా AI-శక్తి అనుసంధానం, క్వాంటం-సంబంధిత సమస్యలతో సహా కీలకమైన ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకోనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉగ్రవాదం, ఆపరేషన్ సిందూర్
భారతదేశం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక చర్యలను పూర్తి చేసిన నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్ హస్తం ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కెనడాలో G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్నట్లు చెప్పిన ప్రధాని మోదీ.. ఇది వివిధ ప్రపంచ సమస్యలపై దృక్పథాలను మార్పిడి చేసుకోవడానికి, గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను వివరించడానికి ఒక గొప్ప వేదికను అందిస్తుంది సమావేశాన్ని ఉద్దేశిస్తూ పేర్కొన్నారు.
భారత్-కెనడా దౌత్య వివాదం తర్వాత మొదటి సారి..
2015 తర్వాత ప్రధాని మోదీ కెనడాకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా మాజీ ప్రధాని ట్రూడో ఆరోపించిన తర్వాత, కెనడా తీవ్రవాద, భారత వ్యతిరేక శక్తులకు ఆశ్రయం కల్పిస్తోందని భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేయడంతో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ ఉండటంతో రెండు దేశాలు తమ దౌత్య సంబంధాలను పునఃపరిశీలించుకునే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
