PM Modi: వచ్చే వారం ప్రధాని మోదీ 4 రాష్ట్రాల పర్యటన.. కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం..
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. 24న ఆయన తన పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొన్ని కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా- నగర్ హవేలీ, డామన్, డయ్యూలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూలను సందర్శించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన సోమవారం (ఏప్రిల్ 24) నుంచి ప్రారంభమై మంగళవారం (ఏప్రిల్ 25)తో ముగుస్తుంది. మొదటి రోజు అంటే సోమవారం మధ్యప్రదేశ్‌లోని రేవాలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారని పీఎంవో తెలిపింది. ఇక్కడ సుమారు రూ.19 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు.
దీని తర్వాత, మంగళవారం తిరువనంతపురం సెంట్రల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం రూ. 3,200 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. దాద్రా, నగర్ హవేలీలో ప్రధాని మోదీ నమో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఆయన ప్రారంభిస్తారు.
ఏప్రిల్ 24న, మధ్యప్రదేశ్‌లోని రేవాలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు. అక్కడ దాదాపు రూ.19,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేస్తారు. ఏప్రిల్ 25న తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం తిరువనంతపురంలో రూ.3200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు.
ప్రధాని మోదీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ను సందర్శిస్తారు మరియు సిల్వస్సా, దాద్రా మరియు నగర్ హవేలీలో రూ.4850 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. దీని తర్వాత, సాయంత్రం 6 గంటలకు డామన్‌లోని దేవ్‌కా సముద్ర తీరాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.
కేరళలో ప్రధాని మోదీ కార్యక్రమాలు ఇలా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు అన్ని సన్నాహాలు చేస్తూన్నాయి బీజేపీ శ్రేణులు. ఆయన పర్యటనను ప్రకటిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టర్‌ను షేర్ చేశాయి. ప్రపంచ నాయకుడు కేరళకు వస్తున్నారని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. కేరళకు ప్రధాని ‘విషు కైనెట్టం’ (విషు కానుక) వందే భారత్‌ను వివరిస్తూ బీజేపీ, ‘కేరళ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తోంది.
కేరళ సందర్శన ఎందుకు ఇంత ముఖ్యమైనదంటే..?
ఇక్కడ పార్టీ పెద్ద ఎత్తున మైనారిటీ సంప్రదింపు కార్యక్రమాలను నిర్వహిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ పర్యటన జరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మైనారిటీలకు చేరువయ్యేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పార్టీ నాయకులు క్రైస్తవ కుటుంబాలతో ఇటీవలి ఉత్తర ప్రత్యుత్తరాలు, కమ్యూనిటీకి చెందిన కొంతమంది పాస్టర్లతో అల్పాహారంలో వారి సమావేశాలను చూశాం. ప్రధాని మోదీ పర్యటన తమ కొనసాగుతున్న ప్రచారానికి ఊపునిస్తుందని, సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ ప్రచారానికి నాంది పలుకుతుందని కేరళ బీజేపీ విశ్వసిస్తోంది.
మరిన్ని జాతీయవార్తల కోసం




