Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi UP tour: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంపై ప్రధాని మోడీ వరాలజల్లు.. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్..!

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల శంఖారావం పూరించారు ప్రధాని నరేంద్ర మోడీ. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అభవృద్ధి కార్యక్రమాలపై బీజేపీ సర్కార్ పోకస్ చేసింది. ఈ క్రమంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మోడీ ప్రారంభించారు.

PM Modi UP tour: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంపై ప్రధాని మోడీ వరాలజల్లు.. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్..!
Pm Modi Up Tour
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 14, 2021 | 8:49 PM

PM Modi Visits Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల శంఖారావం పూరించారు ప్రధాని నరేంద్ర మోడీ. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అభవృద్ధి కార్యక్రమాలపై బీజేపీ సర్కార్ పోకస్ చేసింది. ఈ క్రమంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి అదిత్యనాథ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మోడీ.

అలీఘడ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి మోడీ మంగళవారం శంకుస్థాపన చేశారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌కు కితాబు ఇచ్చారు ప్రధాని. గతంలో ఉత్తరప్రదేశ్‌లో మాఫియా రాజ్యం ఉండేదని , కాని యోగి సీఎం అయ్యాక మాఫియాపై ఉక్కుపాదం మోపారని అన్నారు. యూపీకి పెద్ద ఎత్తున తరలివస్తున్న పరిశ్రమలతో పెట్టుబడుల వర్షం కురుస్తోందని ప్రశంసించారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందని అన్నారు. కరోనాపై పోరులో ఉత్తరప్రదేశ్‌ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం యోగి వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు.

అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్శిటీకి ప్రధాని మోడీ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్శిటీ ఎగ్జిబిషన్ మోడల్, ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ మోడల్స్‌ను ప్రధాని సందర్శించారు. రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్మృత్యర్థం రాష్ట్ర ప్రబుత్వం ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తోంది.

లోథా, ముసేపూర్ కరీమ్ జరౌలి గ్రామాల్లోని మొత్తం 92 ఎకరాల్లో ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నారు. డిఫెన్స్‌ హబ్‌గా కూడా ఉత్తరప్రదేశ్ అభివృద్ది చెందుతోందని అన్నారు మోడీ. రాష్ట్రంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలీగఢ్, ఆగ్రా, కాన్పూర్, చిత్రకూట్, ఝాన్సీ, లక్నోలను ఈ కారిడార్ కలుపుతుంది. అలీగఢ్ నోడ్‌లో భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. 19 సంస్థలకు భూముల కేటాయింపు జరిగింది. ఆ సంస్థలు రూ.12,245 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించడానికి, మేక్ ఇన్ ఇండియాను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడుతుంది.

Read Also… Wife Burns Man: ప్రియుడి మోజులో పడి భర్తకు నిప్పు.. తప్పించుకునేందుకు యత్నించిన వ్యక్తిపై బండరాయితో దాడి..!