AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రతి ఇంట త్రివర్ణ పతాకం.. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు..

Har Ghar Tiranga: ఈ ఏడాది 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ భవనాలతోపాటు 20 కోట్ల ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయం తీసుకుంది.

PM Modi: ప్రతి ఇంట త్రివర్ణ పతాకం.. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు..
Har Ghar Tiranga Campaign PM Modi
Sanjay Kasula
|

Updated on: Jul 22, 2022 | 11:18 AM

Share

75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ఇప్పటికే దేశవ్యాప్తంగా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ భవనాలతోపాటు 20 కోట్ల ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా ‘ హర్ ఘర్ తిరంగా’ ప్రచారాన్ని బలోపేతం చేయాలని అన్నారు. ఈ ప్రచారం త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని మరింతగా పెంచుతుందని ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా కోరారు.

కేంద్రం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ‘హర్ ఘర్ తెరంగా’ అని పేరు పెట్టారు. ఆగస్టు నెలలో మూడు రోజుల పాటు ఇంటింటికి జెండాలు ఎగురవేయనున్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, టోల్ ప్లాజాలు, పోలీస్ స్టేషన్లలో జాతీయ జెండాను ఎగురవేయాలని యోచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.

ఈ ఏడాది స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ, ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఉధృతం చేద్దాం. ఆగస్టు 13 నుంచి 15వ తేదీల మధ్య మీ ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి లేదా జెండాను ఎగురవేయండి. ఈ ఉద్యమం జాతీయ జెండాతో మన బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

మన చరిత్రలో జూలై 22కి ఓ ప్రత్యేకత..

మరో ట్వీట్‌లో ప్రధాని మోదీ, ‘ఈరోజు జూలై 22కి మన చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 1947లో ఈ రోజున మన జాతీయ జెండాను స్వీకరించాం.’

స్వతంత్ర భారతదేశానికి జెండా కావాలని కలలు కన్న గొప్ప వ్యక్తులను గుర్తుంచుకోండి – ప్రధాని మోదీ

స్వాతంత్ర్య భారతదేశం కోసం వలస పాలనపై పోరాడినవారిని ఓసారి గుర్తు చేసుకోందాం. జెండా కోసం వారు కన్న కలలను, వారి కృషిని మనం ఈ రోజు గుర్తుంచుకుందాం, వారి దార్శనికతను నెరవేర్చడానికి, వారి కలల భారతదేశాన్ని నిర్మించడానికి నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము. అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

జాతీయ జెండా అమ్మకంపై ఎలాంటి పన్ను విధించబడదు

పాలిస్టర్‌తో తయారు చేసిన జాతీయ జెండా విక్రయాలపై వస్తు సేవల పన్నును కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. పత్తి, పట్టు, ఉన్ని లేదా ఖాదీతో తయారు చేసిన చేతితో నేసిన జాతీయ జెండాలు ఇప్పటికే అటువంటి పన్ను నుండి మినహాయించబడ్డాయి. డిసెంబరు 2021లో చేసిన సవరణలతో సహా ఫ్లాగ్ కోడ్ 2002ని అనుసరించే భారత జాతీయ పతాకాన్ని GST నుంచి మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రచారంలో వందేమాతరం పాడాలని బీజేపీ పిలుపు

అంతకుముందు, భారతీయ జనతా పార్టీ తన 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారంలో భాగంగా ఉదయం ఊరేగింపులో భక్తి గీతం ‘రఘుపతి రాఘవ రాజా రామ్’తోపాటు జాతీయ గీతం ‘వందేమాతరం’ పాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఆగస్టు 9 నుంచి ప్రారంభమయ్యే వారం రోజుల పాటు జరిగే ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారంలో పాల్గొనాలని బిజెపి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర యూనిట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదేశించింది.

ఈ వారం ప్రారంభంలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, సీనియర్ నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర శాఖ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించారు.

జాతీయ వార్తల కోసం