PM Modi: ఇవాళ తత్వవేత్త అరబిందో ఘోష్ స్మారక నాణేన్ని విడుదల చేయనున్న ప్రధాని మోడీ.. ప్రత్యేకత ఏమిటంటే..?

సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, ఆధ్యాత్మిక గురువు అరబిందో ఘోష్ 150వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా పుదుచ్చేరిలోని కంబన్ కలై సంగంలో..

PM Modi: ఇవాళ  తత్వవేత్త అరబిందో ఘోష్ స్మారక నాణేన్ని విడుదల చేయనున్న ప్రధాని మోడీ.. ప్రత్యేకత ఏమిటంటే..?
Pm Modi

Updated on: Dec 13, 2022 | 8:18 AM

సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, ఆధ్యాత్మిక గురువు అరబిందో ఘోష్ 150వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా పుదుచ్చేరిలోని కంబన్ కలై సంగంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా, అరబిందో గౌరవార్థం స్మారక నాణెంతో పాటు పోస్టల్ స్టాంపును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోనూ ప్రసంగిస్తారు. 1872 ఆగస్టు 15వ తేదీన జన్మించిన అరబిందో భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో తనవంతు కృషి చేశారు. స్వాతంత్య్ర పోరాటాని కి ఎంతగానో తోడ్పడ్డ దార్శనికుడు ఆయన. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భం లో దేశ స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములైన వారిని నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయయోధుల జయంతులు, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా అరబిందో ఘోష్ 150వ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు.

భారతగడ్డ పై ప్రభవించిన గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానులలో అరబిందో ఘోష్ ఒకరు. తాను పుట్టిన తేదీన దేశానికి స్వాతంత్య్రం రావడం కాకతాళీయంగానో, ఆకస్మికంగానో జరిగింది. కాదు. దైవ శక్తి సమ్మతితోనే ఇది సంభవించిందని ఒకానొక సందర్భంలో అరవిందులు పేర్కొన్నారు. ఆయన సాధించిన కార్యాల్లో, సాగించిన జీవితంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. తన జీవితంలో సాకారం అవుతాయని కలలుగన్న ప్రపంచ ఉద్యమాలు విజయవంతమయ్యే మార్గంలో ఏ విధంగా ఉన్నదీ శ్రీ అరబిందో ఘోష్ వెల్లడించారు.

స్వతంత్ర భారత దేశం దానికి నాయకత్వ పాత్ర ఎలా వహిస్తుందో ప్రకటించారు. తన అయిదు స్వప్నాలలో మొదటిదాని గురించి ఆయన వివరిస్తూ అది ఈ రోజు మనకు తక్షణ ప్రాధాన్యత ఉన్న విషయం.. భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించడం గురించి, కానీ ఇప్పటికీ మనం ఐకమత్యాన్ని సాధించలేకపోయాం’’ అని అన్నారు. రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ‘‘అణగారిన వర్గాల సమస్యలు, హిందూ-ముస్లిం వర్గాల మధ్య మతపరమైన విభజన సమస్య తప్పనిసరిగా పరిష్కారం కావాలి. ఏ విధంగానైనా విభజన అనేది అంతరించాల్సిందే. రాజకీయపరమైన విభజనను శాశ్వతంగా ఆమోదించకూడదు. అది కేవలం ఒక తాత్కాలిక సాధనం మాత్రమే’’ అని పేర్కొన్నారు. ఇలాంటి విభజనల వల్ల భారతదేశపు అంతర్గత అభివృద్ధికి, శ్రేయస్సుకు అవరోధం కలగవచ్చు. ఇతర దేశాల మధ్య భారతదేశం స్థాయి బలహీనమవుతుంది. దాని భవిష్యత్తు బలహీనపడుతుంది లేదా నిస్పృహలోకి జారుకుంటుంది. భవిష్యత్తులో భారతదేశం గొప్ప స్థానానికి చేరాలంటే దీన్ని నివారించడం ఎంతో అవసరం అని సూచించారు. ఇలా ఎన్నో వాస్తవిక అంశాలను అరబిందో ఘోష్ 70 ఏళ్ల క్రితమే చెప్పారు. అటువంటి మహానీయుని 150వ జయంతి వేడుకలను ఏడాది పొడవునా నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..