Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: జమ్మూ కశ్మీర్‎లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. వేలాది కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం..

ప్రధాని మోదీ జూన్ 20న జమ్మూ, కశ్మీర్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు, శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో 'ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్‌ఫార్మింగ్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. జమ్మూ-కశ్మీర్‎లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. వ్యవసాయరంగానికి పెద్దపీట వేసే క్రమంలో వాటికి సంబంధించిన అనుబంధ రంగాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే జూన్ 21న ఉదయం 6.30 గంటలకు శ్రీనగర్‌లోని SKICCలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.

PM Modi: జమ్మూ కశ్మీర్‎లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. వేలాది కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం..
Pm Modi
Srikar T
| Edited By: TV9 Telugu|

Updated on: Jun 21, 2024 | 11:51 AM

Share

ప్రధాని మోదీ జూన్ 20న జమ్మూ, కశ్మీర్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు, శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో ‘ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్‌ఫార్మింగ్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. జమ్మూ-కశ్మీర్‎లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. వ్యవసాయరంగానికి పెద్దపీట వేసే క్రమంలో వాటికి సంబంధించిన అనుబంధ రంగాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే జూన్ 21న ఉదయం 6.30 గంటలకు శ్రీనగర్‌లోని SKICCలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అక్కడ జమ్ము, కశ్మీర్ అభివృద్దితో పాటు తన పర్యటనకు సంబంధించిన అంశాలపై ప్రసంగిచనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సామూహిక యోగా సెషన్‎లో పాల్గొని యోగా ఆవశ్యకతను గుర్తు చేయనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2015 నుండి ఢిల్లీలోని కర్తవ్య పథ్, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూరు వంటి మహానగరాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు ప్రధాని నాయకత్వం వహిస్తున్నారు.

ముఖ్యంగా యువతకు సాధికారత కల్పించడం, తద్వారా జమ్మూ కశ్మీర్ ను అభివృద్ది చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని రూపొందిచారు. ఆ ప్రాంత పురోగతికి తోర్పడేలా అక్కడి యువతతో సంభాషించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రూ. లక్షల కోట్ల విలువ చేసే 84 మేజ‌ర్ డెవ‌లెవ‌మెంట్ ప్రాజెక్ట్‌ల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. 1,500 కోట్లతో రోడ్డు, మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా పథకాలు, ఉన్నత విద్యకు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పారిశ్రామిక ఎస్టేట్‌ల అభివృద్ధి ఇలా అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే రూ. జమ్మూ కశ్మీర్‎లోని 20 జిల్లాల్లోని 15లక్షల మందికి ఉపాధి చూకూర్చేలా 1,800 కోట్లతో బృహత్తరమైన కొన్ని కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రభుత్వ సర్వీసులకు ఎంపికైన 2000 మందికి పైగా ఉద్యోగులకు ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్నారు. యువతలోని శక్తికి చేదోడుగా నిలిచేలా పలు సహాయసహకారాలను అందించనున్నారు. దీనికి సంబంధించి ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్‌ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జమ్ము-కశ్మీర్ పర్యటనలో చేపట్టే ప్రజాప్రయోజిత కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పండించే ధాన్యానికి కనీస మద్దతు ధరను పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…