Driverless Train: దేశంలోనే తొలిసారి డ్రైవర్ లేకుండానే నడిచే ట్రైన్ వచ్చేస్తోంది..

ఒక దేశం అభివృద్ధి చెందాలంటే రవాణా సదుపాయం ఎంతో కీలకం. దాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో రవాణా సదుపాయాలను మరింత మెరుగు పరుస్తోంది..

Driverless Train: దేశంలోనే తొలిసారి డ్రైవర్ లేకుండానే నడిచే ట్రైన్ వచ్చేస్తోంది..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 25, 2020 | 5:33 AM

Driverless Train: ఒక దేశం అభివృద్ధి చెందాలంటే రవాణా సదుపాయం ఎంతో కీలకం. దాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో రవాణా సదుపాయాలను మరింత మెరుగు పరుస్తోంది కేంద్ర ప్రభుత్వం. అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన భారతదేశంలో.. టెక్నాలజీని ఉపయోగించుకుని మరింత ముందుకు వెళుతోంది. ఇప్పటికే మెట్రో రైళ్ల సదుపాయం పూర్తిస్థాయిలో అందుబాటులో రాగా.. బుల్లెట్ ట్రైన్‌ను ప్రవేశ పెట్టే అంశంపై చర్చలు సాగుతున్నాయి. ఇక తాజాగా భారతదేశంలోనే తొలిసారి డ్రైవర్ లేకుండా నడిచే రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈనె 28వ తేదీన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు. ఈ రైలు ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్‌లో నడవనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు డ్రైవర్ హ్యాండిల్ చేసిన రైలు ప్రయాణపు అనుభూతిని పొందిన ప్రయాణికులు.. ఇక డ్రైవర్ రహిత రైలు ప్రయాణ అనుభూతిని పొందనున్నారు.

Also read:

వందేభారత్ రైల్వే ప్రాజెక్టు నుంచి చైనా కంపెనీ ఔట్.. పోటీలో ఉన్న మూడు స్వదేశీ కంపెనీలు

స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం..గత నెల రోజుల నుంచే అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూన్నామన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి