AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం..గత నెల రోజుల నుంచే అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూన్నామన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కొత్త రకం కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత నెల రోజుల నుంచే అన్ని...

స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం..గత నెల రోజుల నుంచే అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూన్నామన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Sanjay Kasula
|

Updated on: Dec 24, 2020 | 10:03 PM

Share

కొత్త రకం కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత నెల రోజుల నుంచే అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ వస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. కరోనా మళ్లీ విస్తరిస్తే లాక్‌డౌన్‌ విషయంలో రాష్ట్రాలదే నిర్ణయం అని స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి దాదాపు ఎనమిది నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోగా ఇంకా అనేక లక్షల మంది వైరస్‌తో పోరాడతున్నారు. టీకా వస్తే వైరస్‌కు చెక్‌ పెట్టొచ్చని అంతా భావిస్తున్న తరుణంలో కొత్త రకం కరోనా వైరస్‌ కోరలు తొడుక్కొని విస్తరిస్తుండటం భయాందోళన కలిగిస్తుంది. సెకండ్‌ వేవ్‌ వైరస్‌ మరింత ప్రమాదకరంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు.

భారత్‌లోనూ యూకే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కొత్తరకం వైరస్‌ను గుర్తించామని వైద్యులు తెలిపారు. వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ విధించేందుకు కసరత్తు చేస్తున్నాయి. గతంలో మాదిరిగా దేశమంతా లాక్‌డౌన్‌ పెట్టే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలన్నారు.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా