షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!

Covid Outbreak At Work: ఒకవైపు అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ఆందోళనకు గురి చేస్తుండగా.. ఆ దేశంలోని దక్షిణ ఒరెగాన్‌ రాష్ట్రంలో...

  • Ravi Kiran
  • Publish Date - 10:04 pm, Thu, 24 December 20
షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!

Covid Outbreak At Work: ఒకవైపు అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ఆందోళనకు గురి చేస్తుండగా.. ఆ దేశంలోని దక్షిణ ఒరెగాన్‌ రాష్ట్రంలో ఓ భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి(స్లీపింగ్ సెల్) కారణంగా సుమారు 300 మంది క్వారంటైన్‌కు వెళ్లడమే కాకుండా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే..

దక్షిణ ఒరెగాన్‌‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తికి కరోనా సోకింది. అయితే అతడికి లక్షణాలు లేకపోవడంతో యధావిధిగా తన రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యాడు. ఆఫీస్‌కు వెళ్తూ.. వచ్చేవాడు. ఇక అదే అతడు చేసిన పెద్ద తప్పని తర్వాత తెలిసింది. తనకు తెలియకుండానే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. అతడు పని చేస్తోన్న కంపెనీలో వైరస్ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 300 మంది క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని డగ్లస్ కౌంటీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే, క్లస్టర్ వ్యాప్తి జరిగిన సంస్థ పేరును మాత్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ బహిర్గతం చేయలేదు. కాగా, ఆరోగ్య శాఖ అధికారులు అతడితో కాంటాక్ట్ అయినవారికి పరీక్షలు చేయడమే కాకుండా సంస్థ ఉద్యోగులను హోం క్వారంటైన్‌లో ఉంచారు.

Also Read:

యాంటీ బయోటిక్స్‌ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట

‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..

బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్