PM Modi: ఇక ఇంటింటికి రాముడు వస్తాడు.. పార్లమెంట్‌లో దాడి ఘటనపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..
పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ మరోసారి ఆందోళన వ్యక్తంచేశారు. పార్లమెంట్‌లో డిసెంబర్ 13న జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందని.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, మూలాలను బయటకు తీయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని.. దాడిపై లోతైన దర్యాప్తు జరిపి.. సూత్రధారులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ మరోసారి ఆందోళన వ్యక్తంచేశారు. పార్లమెంట్‌లో డిసెంబర్ 13న జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందని.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, మూలాలను బయటకు తీయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని.. దాడిపై లోతైన దర్యాప్తు జరిపి.. సూత్రధారులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇదేకాకుండా జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల్లో కొత్త వారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం, రామ మందిరం, ఇండియా కూటమి, సంక్షేమ పథకాల అమలు, ప్రపంచ పరిస్థితులు సహా అనేక అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు. హిందీ పత్రిక జాగ్రన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని పలు విషయాలను పంచుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి చారిత్రాత్మక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అదే సమయంలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని ప్రత్యేక రోజుగా అభివర్ణించారు.
ప్రధాని మోదీ ఇంటర్వ్యూలో కీలక అంశాలు..
- పార్లమెంట్ కుట్ర ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. పార్లమెంట్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలని అన్నారు. ఘటనపై లోతుగా విచారణ జరిపించాలని సూచించారు.
- జమ్మూకశ్మీర్‌లో తొలగించిన ఆర్టికల్ 370కి సంబంధించి మాట్లాడిన ప్రధాని మోదీ.. రద్దు చేసే శక్తి మరెవరికీ లేదన్నారు. ఇంకా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాగల శక్తి మరెవరికి లేదని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించాలని కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
- మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు (మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్) దేశ వాతావరణాన్ని మరోసారి చాటిచెప్పాయని ప్రధాని మోదీ అన్నారు. స్థిరమైన, శాశ్వతమైన, సేవా ఆధారిత ప్రభుత్వం కోసం ప్రజలు తీర్పును ఇచ్చారన్నారు.
- ‘మోదీ హామీ’పై ప్రధాని మాట్లాడుతూ.. సాధారణ పౌరుడి మనసులో హామీని చెప్పిన వెంటనే నాలుగు ప్రమాణాలు తెరపైకి వస్తాయని అన్నారు. విధానం, ఉద్దేశాలు, నియమాలు, పనికి సంబధించిన ట్రాక్ రికార్డ్.. ప్రజా న్యాయమూర్తులు ఈ నాలుగు ప్రమాణాలు చూస్తారు.. తమ విధానాలకు ప్రజల మద్దతు ఉందంటూ మోదీ అభిప్రాయపడ్డారు.
- 2014కి ముందు రాజకీయ అస్థిరత కారణంగా దేశం నష్టపోయిందని ప్రధాని అన్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ బీజేపీ విజయంపై కూడా ఆయన మాట్లాడారు. తప్పక బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని తెలిపారు.
- కొత్త నాయకులను ముఖ్యమంత్రులుగా చేయడంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎవరైనా తనను తాను ముద్రించుకుంటే, ఇతరుల దృష్టిని ఆకర్షించరంటూ పేర్కొన్నారు. కొత్తవారి ప్రతిభ గురించి చర్చ లేదు. కొత్త వ్యక్తులు కూడా దీర్ఘ తపస్సుతో అనుభవాన్ని సంపాధించుకుంటారన్నారు.
- రామ మందిర ప్రారంభోత్సవం గురించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ.. శ్రీరాముని దర్శనం ద్వారా జీవితం సఫలమవుతుందన్నారు. ఈ పవిత్ర కార్యంలో పాలుపంచుకోమని ఆహ్వానం రావడం తన అదృష్టమని తెలిపారు. ఈ ఆనందం మోదీది కాదు. ఇది భారతదేశంలోని 140 కోట్ల హృదయాల సంతోషం.. ఈ జనవరి 22 సందర్భం ‘హర్ ఘర్ అయోధ్య, హర్ ఘర్ రామ్’.. కల సాకారం అవుతుందన్నారు.
- ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అతిపెద్ద, ధనిక ఆర్థిక వ్యవస్థల పరిస్థితి బాగా లేదని ప్రధాని మోదీ అన్నారు. నేడు, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ప్రతి రంగం మెరుగైన పనితీరును కనబరుస్తోంది. కొత్త బడ్జెట్‌తో పాటు కొత్త పథకాలను కూడా ప్రభుత్వం రూపొందించనుంది.. అంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




