PM Modi: మన తల్లుల సిందూరం దూరం చేస్తే.. ఏం జరుగుతుందో చేసి చూపించాం..
పహల్గామ్‌లో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్‌లో సాహసోపేతమైన ప్రదర్శన చేశారు.. మన బలగాలకు నా సెల్యూట్ అంటూ ప్రధాని మోదీ ప్రసంగం మొదలు పెట్టారు. సైనికుల సాహస, పరాక్రమాలు దేశ మహిళలకు అంకితమంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

పహల్గామ్‌లో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్‌లో సాహసోపేతమైన ప్రదర్శన చేశారు.. మన బలగాలకు నా సెల్యూట్ అంటూ ప్రధాని మోదీ ప్రసంగం మొదలు పెట్టారు. సైనికుల సాహస, పరాక్రమాలు దేశ మహిళలకు అంకితమంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. పహల్గామ్ లో ఏప్రిల్ 22 ఉగ్రవాదులు.. పర్యాటకులను వారి కుటుంబ సభ్యుల ఎదుటే మతం పేరు అడిగి.. చంపారని.. ఇది క్రూరమైన చర్య అంటూ పేర్కొన్నారు.
మన తల్లుల సిందూరం దూరం చేస్తే ఏం జరుగుతుందో చూపించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై పోరుమొదలుపెట్టాం.. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలు ధ్వంసం చేశామన్నారు. మన సైన్యం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది.. రక్షణ దళాలు చేసిన సాహసం దేశానికి తలమానికమన్నారు.
ఉగ్రదాడి తర్వాత దేశం ఒక్కటిగా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామని.. ఉగ్రమూకలను మట్టుబెట్టామని తెలిపారు. ఉగ్రవాదులను భారత క్షిపణులు, డ్రోన్‌లు హతమార్చాయి.. గ్లోబల్ టెర్రరిజానికి బహావల్పూర్ ఒక యూనివర్సిటీగా ఉంది.. అలాంటి వాటిని నేలమట్టం చేశామన్నారు. కేవలం మూడు రోజుల్లో పాకిస్తాన్ భయంతో వణికిపోయిందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..