Cyclone Biparjoy: తీవ్రరూపం దాల్చనున్న బిపోర్‌జాయ్ తుపాను.. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

|

Jun 12, 2023 | 7:34 PM

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ బిపోర్‌జాయ్‌ తుపాను తీవ్రరూపం దాల్చి తీరం వైపు దూసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తుపాను పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Cyclone Biparjoy: తీవ్రరూపం దాల్చనున్న బిపోర్‌జాయ్ తుపాను.. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
Baparjoy Cyclone
Follow us on

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ బిపోర్‌జాయ్‌ తుపాను తీవ్రరూపం దాల్చి తీరం వైపు దూసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తుపాను పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. తాగునీరు, కరెంట్, వైద్యం వంటి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలని కోరారు. నష్టనివారణ చర్యలు వెంటనే చేపట్టేలా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని సూచించారు.

తుపాను పరిస్థితులను కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే 12 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు మరో 15 బృందాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంది. మరోవైపు జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ కూడా బిపోర్‌జాయ్‌ తుపాను సంసిద్ధత చర్యలను సమీక్షించింది. ఈ తుపాను జూన్ 14 వరకు ఉత్తర దిశగా కదులుతూ.. ఆ తర్వాత గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌లను దాటుతుందని.. ఈ సమయంలో గంటకు 125-150 కిలోమీటర్ల వేగంతో గాలుల వీస్తాయని భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.