AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఇదే జోరును కొనసాగిస్తాం.. ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 3వ స్థానానికి భారత్.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..

ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం.. దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అనేక రంగాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో తయారీ రంగంలో శక్తివంతంగా మార్చేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది..

PM Modi: ఇదే జోరును కొనసాగిస్తాం.. ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 3వ స్థానానికి భారత్.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
PM Narendra Modi
Shaik Madar Saheb
|

Updated on: Aug 05, 2024 | 2:23 PM

Share

ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం.. దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అనేక రంగాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో తయారీ రంగంలో శక్తివంతంగా మార్చేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది.. దీనికి తగినట్లుగా.. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద మేకిన్ ఇండియా నినాదాన్ని తీసుకువచ్చి.. దాని కోసం అన్ని రకాలుగా సహాయ సహకరాలను అందిస్తోంది.. ఈ చొరవకు తగినట్లు ఎలక్ట్రానిక్స్ స్వదేశీ ఉత్పత్తులు కూడా పెరిగాయి.. ఇంకా ఎగుమతి చేయడమే కాదు.. ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఎగుమతి చేసే దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది..

ఇటీవల కాలంలో భారత్ లో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తితో పాటు ఎగుమతి కూడా భారీగా పెరిగింది.. భారతదేశంలో ఐఫోన్ మ్యానుఫాక్చరింగ్ సైతం చేస్తుండటం.. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీతో ప్రపంచ మార్కెట్‌లో భారీ డిమాండ్ నెలకొంది.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువులు, యాపిల్ (ఐఫోన్), మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. భారతదేశం నుండి యాపిల్ ఐఫోన్ ఎగుమతుల పెరుగుదల కారణంగా, ఎలక్ట్రానిక్స్ 2024-25 (FY25) ఏప్రిల్-జూన్ త్రైమాసికం (Q1) చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 10 దేశాల ఎగుమతులలో భారతదేశం మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది.. కేవలం ఇంజనీరింగ్ వస్తువులు.. పెట్రోలియం ఉత్పత్తులు మాత్రమే అధిక ర్యాంక్‌లో ఉండగా.. 2023-24 (FY24) అదే త్రైమాసికంలో ఎలక్ట్రానిక్స్ రంగం నాల్గవ స్థానాన్ని ఆక్రమించింది. వాణిజ్య విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 22 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY25) క్యూ1 ముగింపులో $8.44 బిలియన్లకు చేరుకుంది. ఈ క్రమంలో అశ్విని వైష్ణవ్ కీలక ట్వీట్ చేశారు. భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతి ఇప్పుడు టాప్ 3లో ఉందని పేర్కొన్నారు. మేకింగ్ ఇన్ ఇండియా.. ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తుందంటూ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ట్వీట్..

దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. అశ్విని వైష్ణవ్ ట్వీట్ కు రిట్వీట్ చేసిన ప్రధాని మోదీ.. ఇది నిజంగా ఎంతో సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్‌లో భారతదేశం నైపుణ్యం మా వినూత్నమైన యువశక్తి ద్వారా ఆధారితమైనది. సంస్కరణలు, ప్రోత్సాహంపై మా ప్రాధాన్యతకు ఇది నిదర్శనం మేక్ ఇన్ ఇండియా అని పేర్కొన్నారు. రానున్న కాలంలోనూ ఇదే జోరును కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..