PM Modi: 30 రోజుల్లోనే.. 85 మంది ప్రపంచ నేతలను కలిశానన్న ప్రధాని మోదీ

20 సదస్సులో భాగంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను.. అలాగే 21వ శతాబ్దపు ప్రపంచ దిశను మార్చగలికే శక్తిని కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక యూనివర్శిటీల్లోని విద్యార్థులను.. అలాగే వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి యువ నిపుణులను సైతం అనుసంధానం చేయడానికి ఢిల్లీలోని.. భారత్‌ మండపంలో ఏర్పాటు చేసినటువంటి.. జీ20 యూనివర్సిటీ కనెక్ట్‌‌కు సంబంధించి తుది వేడుకను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.

PM Modi: 30 రోజుల్లోనే.. 85 మంది ప్రపంచ నేతలను కలిశానన్న ప్రధాని మోదీ
Pm Modi

Updated on: Sep 26, 2023 | 9:47 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దౌత్య విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత 30 రోజుల్లో భారత దౌత్యం నూతన శిఖరాగ్రాలను అందుకుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యవధిలోనే తాను ఏకంగా 85 మంది ప్రపంచ నేతలను కలిశానని పేర్కొన్నారు. అలాగే జీ20 సదస్సులో భాగంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను.. అలాగే 21వ శతాబ్దపు ప్రపంచ దిశను మార్చగలికే శక్తిని కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక యూనివర్శిటీల్లోని విద్యార్థులను.. అలాగే వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి యువ నిపుణులను సైతం అనుసంధానం చేయడానికి ఢిల్లీలోని.. భారత్‌ మండపంలో ఏర్పాటు చేసినటువంటి.. జీ20 యూనివర్సిటీ కనెక్ట్‌‌కు సంబంధించి తుది వేడుకను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. అలాగే ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి భిన్న పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఏకంగా ఇన్ని దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అసలు చిన్న విషయం కాదని.. ఇటీవల భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినటువంటి జీ20 సదస్సును గుర్తుచేస్తూ ప్రధాని మోదీ ఈ విధంగా మాట్లాడారు.

అలాగే దేశం అభివృద్ధి దిశగా ప్రయాణాన్ని కొనసాగించాలంటే కూడా.. స్పష్టమైన, స్థిరమైన పాలన ఎంతో అవసరమని అన్నారు ప్రధాని మోదీ. అలాగే చంద్రయాన్‌-3 విజయాన్ని కూడా ఆయన ప్రస్తావనకు తీసుకొచ్చారు. అలాగే ఆగస్టు 23న ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా దేశ చరిత్రలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. అయితే గత 30 రోజుల్లో గనక చూసుకున్నట్లైతే భారత దౌత్యం నూతన శిఖరాలకు చేరుకన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ జీ20 సదస్సు అనేది ఢిల్లీ కేంద్రీకృత కార్యక్రమమే అయినప్పటికీ కూడా.. భారత్‌ దీన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మలిచిందని స్పష్టం చేశారు. అలాగే భారత్ చొరవ వల్ల బ్రిక్స్‌ కూటమిలో కూడా కొత్తగా ఆరు దేశాలు చేరాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అలాగే ఢిల్లీ డిక్లరేషన్‌‎పై ఏకాభిప్రాయం ప్రపంచ హెడ్‌లైన్‌లలో నిలిచిందని పేర్కొన్నారు. అయితే గత నెల రోజుల్లో గనక చూసుకుంటే.. పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మధ్యతరగతి వర్గాల సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రారంభించామని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన, రోజ్‌గార్ మేళా, కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం లాంటి వాటి గురించి మాట్లాడారు. అలాగే ఆశావాదం, అవకాశాలు, స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పేచోట యువత రాణిస్తుందని పేర్కొన్నారు. అయితే గొప్పగా ఆలోచించండని అలాగే.. ఇదే యువతకు నా సందేశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదించడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ బిల్లు డిలిమిటేషన్ తర్వాతే అమలు అవుతుందని.. కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే 2026 తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో 2029 ఎన్నికలకు మహిళలకు ఈ రిజర్వేషన్ అమలు కానుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పుడే అమలు చేయాలని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం