Ayodhya Ram Mandir: దివ్య భవ్య రామ మందిరంలోకి త్వరలో బాల రాముడు.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ..
Shri Ram Mandir: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. వచ్చే ఏడాది జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జనవరిలో అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర ప్రతిష్ఠాపనకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావచ్చని భావిస్తున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం తేదీని ఇంకా ఖరారు చేయలేదు.
అదివో అల్లదివో అయోధ్య. అక్కడి దివ్య భవ్య నవ్య రామ మందిరంలో త్వరలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట జరగనుంది. కొన్నేళ్లుగా జరుగుతున్న నిర్మాణ పనులు పూర్తి కావస్తుండడంతో అయోధ్య రామాలయం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. 2024, జనవరి 22న బాల రాముడి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించనున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
జనవరి 15 నుంచి 21 వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మూడంతస్తుల ఈ ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ చివరికల్లా పూర్తవుతుందని రామాలయ నిర్మాణ కమిటీ చెబుతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉండవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. జనవరి 20 నుంచి 24 మధ్య ఏ రోజైనా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని, కచ్చితమైన తేదీని ప్రధానమంత్రి కార్యాలయం ఇంకా తెలియజేయలేదని ఆలయ నిర్మాణ కమిటీ చెబుతోంది. రామ మందిరానికి సంబంధించి ఇంకా కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఆలయ శిఖరానికి సంబంధించిన డిజైన్ వర్క్ జరుగుతోందని, ఏటా శ్రీరామనవమి రోజున గర్భాలయంలోని దేవతా విగ్రహాలపై సూర్యకిరణాలు ప్రసరించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారని రామాలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. బెంగళూరులో శిఖర నిర్మాణం జరుగుతోందని, సైంటిస్టుల పర్యవేక్షణలో డిజైన్ వర్క్ జరుగుతోందంటున్నారు నిర్వాహకులు. దీనికోసం రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పుణెలోని మరో ఇన్‌స్టిట్యూట్ కలిసి కంప్యూటరైజ్‌డ్ ప్రోగ్రామ్‌కి రూపకల్పన చేస్తున్నాయని సమాచారం.
సూర్యకిరణాలు భగవంతుని నుదుటిపై పడేలా..
ప్రతి సంవత్సరం రామ నవమి రోజున పవిత్ర గర్భగుడిలోని భగవంతుని నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఆలయ శిఖరంపై అమర్చే పరికరాన్ని రూపొందించే పని కూడా జరుగుతోందని మిశ్రా చెప్పారు. ఈ పరికరాన్ని బెంగళూరులో తయారు చేస్తున్నామని, దీని రూపకల్పనను శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారని మిశ్రా తెలిపారు. రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మరియు పూణేలోని ఒక ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా దీని కోసం కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు మిశ్రా తెలిపారు.
మకర సంక్రాంతి తర్వాత రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ..
అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు లాంఛనంగా ఆహ్వానించనుంది. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పదిరోజుల పాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత జనవరి 24 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించే వీలుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం