AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ నమామి గంగే ‘ … గంగా ప్రక్షాళనపై ప్రధాని మోదీ సమీక్ష

గంగానది ప్రక్షాళనపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ‘ నమామి గంగే ‘ పేరిట చేపట్టిన ప్రాజెక్టు పురోగతిమీద శనివారం కాన్పూర్ లో జరిగిన సమావేశంలో ఆయన సమీక్షించారు. ‘ నేషనల్ కౌన్సిల్ ఫర్ గంగ ‘ నిర్వహించిన తొలి సమావేశమిది.. ఈ మీటింగ్ లో యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, త్రివేంద్ర సింగ్ రావత్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ, ఇంకా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు పనులు ఎంతవరకు […]

' నమామి గంగే ' ... గంగా ప్రక్షాళనపై ప్రధాని మోదీ సమీక్ష
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Dec 14, 2019 | 4:36 PM

Share

గంగానది ప్రక్షాళనపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ‘ నమామి గంగే ‘ పేరిట చేపట్టిన ప్రాజెక్టు పురోగతిమీద శనివారం కాన్పూర్ లో జరిగిన సమావేశంలో ఆయన సమీక్షించారు. ‘ నేషనల్ కౌన్సిల్ ఫర్ గంగ ‘ నిర్వహించిన తొలి సమావేశమిది.. ఈ మీటింగ్ లో యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, త్రివేంద్ర సింగ్ రావత్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ, ఇంకా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకున్న మోదీ.. సంబంధిత రాష్ట్రాల సీఎం లకు, అధికారులకు తగిన సూచనలు, సలహాలిచ్చారు. ఈ సమావేశానికి ముందు గంగానది ప్రక్షాళనపై ‘ నమామి గంగ మిషన్ ‘ నిర్వహించిన ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టు కింద చేబట్టిన పనులను చూసేందుకు ఆయన గంగా బ్యారేజీ సమీపంలో కొత్తగా నిర్మించిన ‘ అటల్ ఘాట్ ‘ ను విజిట్ చేస్తారని, అతి పెద్ద డ్రైన్ వద్ద ఈ మధ్యే ఏర్పాటు చేసిన ‘ సెల్ఫీ పాయింట్ ‘ లో ‘ సెల్ఫీ ‘ దిగుతారని తెలుస్తోంది. అటు మోదీ శనివారం మధ్యాహ్నం గంగానదిలో కొద్దిసేపు బోటులో ప్రయాణించారు. ఆయన వెంట యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు.. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీతో సహా ఈ రెండు రాష్ట్రాల అధికారులు ఉన్నారు. గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా- శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి.. పనుల పురోగతిపై అధికారులనుంచి వివరాలు తెలుసుకున్నారు.

Follow Us
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..