PM Modi: అదే మోదీ గొప్పతనం.. ఛత్తీస్‌గఢ్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని ఏం చేశారంటే..
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రులు భూపేశ్ బఘేల్..
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్ర రాజధాని రాయ్‌పుర్‌లోని సైన్స్ కళాశాల మైదానంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రులు భూపేశ్ బఘేల్, రమణ్‌సింగ్ హాజరయ్యారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రం వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పనికి వేదికపై ఉన్న వారితో పాటు హాజరైన ప్రజలు అవాక్కయ్యారు.
ప్రధాని, గవర్నర్‌కు వేసిన కుర్చిల ముందు ఓ చిన్నపాటి టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆ టేబుల్‌ను పక్కకు జరపాల్సి ఉంది. గవర్నర్ ఆ టేబుల్‌ను పక్కకు జరిపేందుకు ప్రయత్నించగా, వెంటనే ప్రధాని మోడీ ఆ టేబుల్‌ను పక్కకు జరిపేందుకు సహకరించారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పుడు ప్రధాని ఇలా టేబుల్‌ను జరపడం అందరికిలో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | Prime Minister Narendra Modi helped in moving a table on the stage during the swearing-in ceremony in Raipur, Chhattisgarh earlier this evening.
BJP leader Vishnu Deo Sai took oath as the Chief Minister while Arun Sao & Vijay Sharma took oath as the Deputy Chief… pic.twitter.com/l5FQV979Ue
— ANI (@ANI) December 13, 2023
ఇదిలా ఉండగా, దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3వ తేదీన వెలువడిన ఫలితాల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ ఏకంగా 54 స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయకేతనం కమలం. 90 సీట్లు ఉన్న అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి