Chennai: చెన్నైలో తీరని తుఫాన్ కష్టాలు.! ఇప్పటికి వరద ముంపులోనే చెన్నై నగరం.

Chennai: చెన్నైలో తీరని తుఫాన్ కష్టాలు.! ఇప్పటికి వరద ముంపులోనే చెన్నై నగరం.

Anil kumar poka

|

Updated on: Dec 13, 2023 | 6:46 PM

మిచౌంగ్‌ తుపాను తమిళనాడు రాజధాని చెన్నైలో బీభత్సం సృష్టించింది. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరం అతలాకుతమైంది. వర్షాలు తగ్గి వారం రోజులు గడుస్తున్నా తుపాను కష్టాలు చెన్నైని వీడటం లేదు. నగర శివారు ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. భారీగా పోటెత్తిన వరద నీటితో చెన్నైలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇంకా వరద ముంపులోనే జీవనం సాగిస్తున్నారు.

మిచౌంగ్‌ తుపాను తమిళనాడు రాజధాని చెన్నైలో బీభత్సం సృష్టించింది. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరం అతలాకుతమైంది. వర్షాలు తగ్గి వారం రోజులు గడుస్తున్నా తుపాను కష్టాలు చెన్నైని వీడటం లేదు. నగర శివారు ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. భారీగా పోటెత్తిన వరద నీటితో చెన్నైలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇంకా వరద ముంపులోనే జీవనం సాగిస్తున్నారు. పలు ఇళ్లు, కాలనీలు వరదనీటితో నిండిపోయాయి. వరద ముంపుతో ఇప్పటికీ బోట్లనే ఆశ్రయిస్తూ నానా అవస్థలు పడుతున్నారు.

తమ కష్టాలను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంతి స్టాలిన్‌ తుపాను బాధితులకు ప్రతి ఇంటికి ఆరువేల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు, పంట నష్టంపై పదిహేడువేల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆర్ధికసాయాన్ని వెంటనే అమలు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మరో వైపు తుపాను ప్రభావితప్రాంతాల్లో సోమవారం కేంద్ర బృందం పర్యటించనుంది. తుపాను నష్టంపై అంచనావేయనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.