Viksit Bharat Sankalp Yatra: వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ
మనం తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు రేపటి తరం భవిష్యత్తును నిర్థారిస్తాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతీ ఒక్కరూ చొరవ తీసుకోవాలని పిలుపిచ్చారు. వికాస్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించారు ప్రధాని మోదీ.

మనం తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు రేపటి తరం భవిష్యత్తును నిర్థారిస్తాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతీ ఒక్కరూ చొరవ తీసుకోవాలని పిలుపిచ్చారు. విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించారు ప్రధాని మోదీ. కుటుంబ వృద్ధితో పాటు ప్రభుత్వ పథకాలు ఏమేరకు ఉపయోగపడ్డాయో ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక స్థాయి ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులతో ప్రధాన మంత్రి జరిపే మూడవ సంభాషణ ఇది. వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర దేశవ్యాప్తంగా ప్రభుత్వ కీలక పథకాలు ప్రతి ఒక్కరి చేయాలన్న లక్ష్యంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా చాలా మంది లబ్ధిదారులతో నేరుగా సంభాషించారు. ప్రధానితో మాట్లాడిన సందర్భంగా లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలను చేరుకోలేని దేశంలోని పేద రైతులు, కూలీల కోసం ప్రత్యేకంగా వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్వాతంభన సాధించాలన్న ప్రధాని మోదీ లక్ష్యం మేరకు వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ యాత్రను ఐదు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమలులో ఉన్న ప్రవర్తనా నియమావళి కారణంగా ఈ పథకం అమలు కాలేదు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత నెల రోజులుగా ఈ యాత్ర వందలాది పట్టణాలకే కాకుండా వేలాది గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్లిందన్నారు.
ఈ సందర్భంగా, ఈ వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభిస్తున్న ఐదు రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలకు ఈ పథకం ప్రయోజనాలను ఆయా రాష్ట్రాల ప్రజలకు అందించడానికి ప్రతి వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి కేంద్ర పథకాల ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వర్చువల్ సంభాషణలో, ముంబైకి చెందిన మేఘన అనే మహిళా పారిశ్రామికవేత్త తాను ఒంటరి తల్లినని చెప్పారు. తాను ఉపాధి సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు వివరించారు. అలాంటి పరిస్థితుల్లో ముద్ర యోజన కింద బ్యాంకులో రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించానన్నారు. ఈ రోజు తన వ్యాపారం చాలా బాగా జరుగుతోందని, చాలా మంది మహిళలకు ఉపాధిని కూడా ఇచ్చినట్లు మేఘన తెలిపారు. అదేవిధంగా, గౌహతికి చెందిన కళ్యాణి తాను కూడా బ్యాంకు నుండి రుణం తెచ్చుకున్నానని, ఆ తర్వాత తన వ్యాపారం ప్రారంభించానని చెప్పారు. లబ్ధిదారుల మాటలు విన్న ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ద్వారా అందే ప్రతి పథకం నేరుగా దేశ ప్రజలందరికీ చేరువ కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
ఇక, ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు, ఒడిశాలోని కటక్‌లోని బరాంగ్‌లోని దబ్షా పాట్నాలో వికాస్ భారత్ సంకల్ప్ యాత్రను కూడా నిర్వహించారు. ఇక్కడ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లడం, తద్వారా నిరుపేదలు దాని ప్రయోజనాలను పొందేలా చేయడం ప్రధాని మోదీ దార్శనికత స్పష్టంగా ఉందని అన్నారు.
కటక్‌లో లబ్ధిదారులతో సంభాషించిన ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోదీ హామీ పథకం ప్రతి వ్యక్తి జీవితంలో, సమాజంలోని ప్రతి రంగాలలోని సామాన్య ప్రజల అవసరాలను తీర్చబోతోందని అన్నారు. నేడు మారుమూల ప్రాంతాల ప్రజలు కరెంటు, నీరు, తిండి గింజలు, ఉపాధి, సొంత ఇల్లు, చదువు తదితర సంక్షేమ పథకాలన్నింటి నుంచి విశేష ప్రయోజనాలు పొందుతున్నారన్నారు కేంద్ర మంత్రి. ఒడిశా ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
