PM MODI: గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ సమీక్ష.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ

| Edited By: Ravi Kiran

Nov 01, 2022 | 5:21 PM

గుజరాత్ లోని మోర్బీ పట్టణంలోని బ్రిటిష్ కాలం నాటి వేలాడే వంతెన కూలిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబర్ ఒకటో తేదీన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గుజరాత్ చేరుకున్న ఆయన మంగళవారం ఉదయం..

PM MODI: గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ సమీక్ష.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
Pm Narendra Modi
Follow us on

గుజరాత్ లోని మోర్బీ పట్టణంలోని బ్రిటిష్ కాలం నాటి వేలాడే వంతెన కూలిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబర్ ఒకటో తేదీన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గుజరాత్ చేరుకున్న ఆయన మంగళవారం ఉదయం గాంధీనగర్ లోని రాజ్ భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఘటనకు గల కారణాలతో పాటు, అందిస్తున్న సహాయక చర్యల గురించి ప్రధానమంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. ఘటనలో మృతి చెందిన కుటుంబాలతో పాటు, క్షతగాత్రుల కుటుంబాలకు అన్ని విధాలా అవసరమైన సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. దుర్ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్, హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి, గుజరాత్ చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు రాష్ట్ర హోం శాఖ, గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులతో సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బీ పట్టణంలోని బ్రిటిష్ కాలం నాటి వేలాడే వంతెన ఆదివారం సాయంత్రం కూలిపోవడంతో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నదిలో గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే ప్రదాని నరేంద్ర మోడీ మంగళవారం మోర్బీని సందర్శించారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాంకేతిక, నిర్మాణ లోపాలు, కొన్ని నిర్వహణ సమస్యలే ఈ దుర్ఘటనకు ప్రాథమికంగా కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ధృవీకరణ లేకపోవడంతో పాటు కొన్ని నిర్వహణ సమస్యలతో సహా సాంకేతిక, నిర్మాణ లోపాలు ఈ విషాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. మోర్బి వంతెన కూలిపోవడంపై సోమవారం అర్థరాత్రి జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి కూడా ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..