AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహావిషాదాన్ని సృష్టించిన మోర్బిలో ప్రధాని మోదీ పర్యటన.. స్థానిక అధికారుల అత్యుత్సాహం…

గుజరాత్‌లోని మోర్బీలోని సివిల్ ఆసుపత్రికి ప్రధాని నరేంద్ర మోడీ సందర్శనకు ముందు ముమ్మరంగా మరమ్మతు పనులను చేపట్టారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతాయి.

మహావిషాదాన్ని సృష్టించిన మోర్బిలో ప్రధాని మోదీ పర్యటన.. స్థానిక అధికారుల అత్యుత్సాహం...
Morbi Hospital
Jyothi Gadda
|

Updated on: Nov 01, 2022 | 9:17 AM

Share

సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బీ పట్టణంలోని బ్రిటిష్ కాలం నాటి వేలాడే వంతెన ఆదివారం సాయంత్రం కూలిపోవడంతో కనీసం 134 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నదిలో గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే ప్రదాని నరేంద్ర మోడీ మంగళవారం మోర్బీని సందర్శించనున్నారు. దీంతో స్థానిక అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. సస్పెన్షన్ బ్రిడ్జి కూలిపోయిన బాధితులను చేర్చుకున్న గుజరాత్‌లోని మోర్బీలోని సివిల్ ఆసుపత్రికి ప్రధాని నరేంద్ర మోడీ సందర్శనకు ముందు ముమ్మరంగా మరమ్మతు పనులను చేపట్టారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతాయి. వీటి ఆధారంగా బిజెపిని లక్ష్యంగా చేసుకోవడానికి కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది మంచి ఆయుధంగా మారింది. దీంతో అధికార పార్టీపై విపక్షాలు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నాయి.

మోర్బీ సివిల్ హాస్పిటల్‌కి రాత్రిపూట రంగులు వేస్తున్నారు. కాబట్టి రేపు ప్రధాని మోడీ ఫోటోషూట్ సమయంలో ఆస్పత్రి భవనం అధ్వాన్నమైన పరిస్థితి బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉంటుందని విపక్షాలు విమర్శించాయి. 134 మంది చనిపోయారు. వందల మంది గల్లంతయ్యారు. అసలు దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కానీ బిజెపి ఫోటోషూట్‌లు చేస్తూ కప్పిపుచ్చుకోవాలనుకుంటుందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బీ పట్టణంలో ఆదివారం సాయంత్రం బ్రిటిష్ కాలం నాటి వేలాడే వంతెన కూలిపోవడంతో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాంకేతిక, నిర్మాణ లోపాలు, కొన్ని నిర్వహణ సమస్యలే ఈ దుర్ఘటనకు ప్రాథమికంగా కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ధృవీకరణ లేకపోవడంతో పాటు కొన్ని నిర్వహణ సమస్యలతో సహా సాంకేతిక, నిర్మాణ లోపాలు ఈ విషాదానికి కారణమని మా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని అని రాజ్‌కోట్ రేంజ్ ఐజి అశోక్ కుమార్ యాదవ్ తెలిపారు. మోర్బి వంతెన కూలిపోవడంపై సోమవారం అర్థరాత్రి జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. విషాదంలో నష్టపోయిన వారికి అన్ని విధాలుగా సహాయం అందించాలని అధికారులను కోరినట్లు పిటిఐ నివేదించింది. ప్రమాద స్థలంలో ప్రారంభించిన సహాయ, సహాయక చర్యలపై ప్రధానికి వివరించడంతోపాటు విషాదానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి