Vastu Tips: మీరు ఇళ్లు ఊడ్చే చీపురును ఎక్కడ పెట్టాలో తెలుసా? విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో వివాదాలకు ఈ వస్తువే కారణం..

ముఖ్యంగా మీ పూజా గది, వంటగది, పడకగది వంటి ప్రదేశాల్లో వీటిని అస్సలు పెట్టరాదు. ఇంట్లోని ఈ ప్రదేశాల్లో దేనిలోనూ చీపురు, తుడుపుకర్రను ఎప్పుడు కూడా ఉంచకూడదు. మీరు చీపురు, తుడుపుకర్రను మీ ఇంటి వాయువ్య, పశ్చిమ మూలలో ఉంచవచ్చు. కానీ,

Vastu Tips: మీరు ఇళ్లు ఊడ్చే చీపురును ఎక్కడ పెట్టాలో తెలుసా? విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో వివాదాలకు ఈ వస్తువే కారణం..
Broom
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 01, 2022 | 7:23 AM

వాస్తు శాస్త్రం అనేది మీ ఇంట్లోని ప్రతి సానుకూల, ప్రతికూల అంశాలను చూసే గొప్ప అధ్యయనం. ఇంటి వాస్తు కూడా సానుకూల శక్తిని ఆకర్షించడానికి ఇంటి పరిస్థితి గందరగోళంగా మార్చే శక్తి ఉంటుంది. మన ఇంటి చుట్టూ ఉంచిన వస్తువులను సరైన దిశ,నియమాల ప్రకారం ఉంచకపోతే, అవి ఇంటికి ఇబ్బందిని కలిగిస్తాయి. మనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ, ఎలా ఇంట్లో అమర్చుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియక పొరపాటు చేస్తుంటారు. వాస్తు విషయంలో ఇంటిని శుభ్రం చేసే చీపురు, తుడుపుకర్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. నిజానికి మనం ఈ వస్తువులతో ఇంటిని శుభ్రం చేసుకుంటాము. కానీ, వీటికి వాస్తు నియమాలు పాటించలేము. వీటిని సరిగ్గా ఉంచుకోకపోతే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ రావచ్చు. ఇక్కడ మీరు వాస్తు ప్రకారం చీపురు, తుడుపు కర్రలను ఉంచాలి. దాంతో ఆనందం, శ్రేయస్సు కొలువుంటాయి. శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే జీవితంలో పురోగమన మార్గాల్లో పయనించే అవకాశాలు కలుగుతాయని శాస్త్రం సూచిస్తుంది.

వాస్తుపై నమ్మకం ఉంటే, మీరు ఇంట్లోని కొన్ని దిశలలో కూడా చీపురు, తుడుపుకర్రను ఉంచకూడదు. ముఖ్యంగా మీ పూజా గది, వంటగది, పడకగది వంటి ప్రదేశాల్లో వీటిని అస్సలు పెట్టరాదు. ఇంట్లోని ఈ ప్రదేశాల్లో దేనిలోనూ చీపురు, తుడుపుకర్రను ఎప్పుడు కూడా ఉంచకూడదు. మీరు చీపురు, తుడుపుకర్రను మీ ఇంటి వాయువ్య, పశ్చిమ మూలలో ఉంచవచ్చు కానీ వాటిని ఈశాన్య లేదా ఆగ్నేయ దిశలో, పూజా గదిలో ఉంచకుండా ఉండండి.

లక్ష్మీదేవి ఒకసారి వైకుంఠానికి వెళ్ళినప్పుడు, ఆ స్థలాన్ని శుభ్రం చేయడానికి చీపురు ఉపయోగించిందని, అందుకే చీపురును మాతా లక్ష్మిగా పూజిస్తారని పురాణాలలో నమ్మకం. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే పూజిస్తారు. సాధారణ రోజుల్లో పూజా స్థలంలో ఉంచకూడదు. మీ ఇంటిలోని చీపురు కళ్లారా కనిపించకుండా దాచాలి, అంతే కాకుండా చీపురును తలక్రిందులుగా లేదా నిలువుగా ఎప్పుడూ ఉంచరాదు.

ఇవి కూడా చదవండి

చీపురు లేదా తుడుపుకర్రను ఎప్పుడూ బహిరంగ ప్రదేశంలో ఉంచవద్దు. చీపురు టెర్రస్ లేదా బాల్కనీలో ఉంచకూడదు. దీని వల్ల మీరు డబ్బును కోల్పోవచ్చు.

మీరు ఎప్పుడూ విరిగిన లేదా పాత చీపురు ఉపయోగించకూడదు. చీపురు వాడితే శనివారాల్లో మాత్రమే మార్చుకుంటే ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. మీ చీపురును ఎల్లప్పుడూ నేలపై చదునుగా ఉంచండి.

చీపురు, తుడుపుకర్రను దాచుకోవాలి. కానీ, ఎప్పుడూ బెడ్‌రూమ్‌లో శుభ్రపరిచే సాధనాలను ఉంచకూడదు. ఇది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. బెడ్‌రూమ్‌లో ఏదైనా శుభ్రపరిచే వస్తువును ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది.

సాయంత్రం ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. మీరు ఉపయోగించిన చీపురు ఎవరికీ ఇవ్వకండి. అది డబ్బు నష్టానికి దారితీస్తుంది. ఇంట్లో రెండు చీపుర్లు కలిపి పెట్టకండి. ఇలా చేయడం వల్ల గొడవలు వస్తాయి. మీరు కొత్త ఇంటికి మారినప్పుడు. పాత చీపురు సరైన స్థానంలో ఉంచండి. కొత్త ఇంట్లోకి ప్రవేశించండి, కానీ చీపురును పాత ఇంట్లోనే వదిలేయొద్దు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..