PM Modi: పండగలాంటి వార్త అంటే ఇది కదా.. పేదలకు ప్రధాని మోదీ గుడ్‌న్యూస్

|

Oct 09, 2024 | 5:08 PM

దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా పేదలకు రేషన్ ద్వారా ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో నాలుగేళ్లపాటు పొడిగించే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

PM Modi: పండగలాంటి వార్త అంటే ఇది కదా.. పేదలకు ప్రధాని మోదీ గుడ్‌న్యూస్
Pm Garib Kalyan Anna Yojana
Follow us on

పేదలకు దసరా కానుక గుడ్‌న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని 80 కోట్ల మందికిపైగా ఉన్న పేదలకు రేషన్ ద్వారా ఉచితంగా పంపిణీ చేసే ఫోర్టిపైడ్ బియ్యాన్ని మరో నాలుగేళ్ల పాటు కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినేట్. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక సంక్షేమ పధకాలపై నిర్ణయం తీసుకున్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద పేదలకు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది కేంద్రం. ఈ పధకాన్ని జూలై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకు కొనసాగిస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. పిఎమ్‌జికెఎవై పథకం ద్వారా రూ. 17,082 కోట్లతో ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఐసీడీఎస్, పీఎం పోషన్ సహా అన్ని పథకాల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా అవుతోంది. రక్తహీనత, శరీరంలో మైక్రో-న్యూట్రియంట్ల కొరతను అధిగమించడమే లక్ష్యం కేంద్ర ప్రభుత్వం ఈ పధకం అందుబాటులోకి తెచ్చింది. పూర్తిగా 100 శాతం కేంద్ర నిధులతోనే అమలవుతున్న ఈ పధకం కింద ప్రతినెలా 5 కిలోల ఫోర్టిపైడ్ రైస్‌ను సబ్సిడీపై పంపిణీ చేస్తారు.

ఏప్రిల్ 2022లో, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) మార్చి 2024 నాటికి దశలవారీగా దేశవ్యాప్తంగా ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మూడు దశలు విజయవంతంగా పూర్తయ్యాయని, మార్చి నాటికి ప్రభుత్వ పథకాలన్నింటిలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రివర్గం తెలిపింది. దేశంలో పోషకాహార భద్రత ఆవశ్యకతపై 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రక్తహీనతను పరిష్కరించడానికి టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(టీపీడీఎస్), ఇతర సంక్షేమ పథకాలు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీస్(ఐసీడీఎస్), పీఎం పోషణా వంటి కార్యక్రమాల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నామన్నారు.

ఇది చదవండి: మీరు మాట్లాడే విధానం.. మీరు ఎలాంటి వారో చెప్పేస్తుంది.! ఎలాగంటే

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..