Rent 45K: వామ్మో.. 1 బీహెచ్‌కే ఇంటి రెంట్‌ రూ.45 వేలా.! షాక్‌లో జనాలు.!

Rent 45K: వామ్మో.. 1 బీహెచ్‌కే ఇంటి రెంట్‌ రూ.45 వేలా.! షాక్‌లో జనాలు.!

Anil kumar poka

|

Updated on: Oct 09, 2024 | 7:24 PM

ముంబైలోని మాతుంగా ఈస్ట్ ప్రాంతంలో 1బీహెచ్‌కే ఇంటి అద్దె రూ.45 వేలు అంటూ ఓ పోస్టు ఇటీవల నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఇంటిని స్థానిక భాషలో ఛాల్ అని పిలుస్తారు. చిన్న చిన్న గదులు ఉండే ఈ ఇళ్లల్లో మంచి వసతులు ఉండవు. ఓ అంతస్తులోని వారందరికీ కలిపి ఒకే బాత్‌రూం ఉంటుంది. అలాంటి భనవంలోని ఓ 1బీహెచ్‌కే ఇంటి రెంటు ఏకంగా రూ.45 వేలుగా నిర్ణయించడంతో జనాలు నోరెళ్లబెడుతున్నారు.

ముంబైలోని మాతుంగా ఈస్ట్ ప్రాంతంలో 1బీహెచ్‌కే ఇంటి అద్దె రూ.45 వేలు అంటూ ఓ పోస్టు ఇటీవల నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఇంటిని స్థానిక భాషలో ఛాల్ అని పిలుస్తారు. చిన్న చిన్న గదులు ఉండే ఈ ఇళ్లల్లో మంచి వసతులు ఉండవు. ఓ అంతస్తులోని వారందరికీ కలిపి ఒకే బాత్‌రూం ఉంటుంది. అలాంటి భనవంలోని ఓ 1బీహెచ్‌కే ఇంటి రెంటు ఏకంగా రూ.45 వేలుగా నిర్ణయించడంతో జనాలు నోరెళ్లబెడుతున్నారు. “ఓ పాత ఇంటిని ఓల్డ్ స్కూల్ స్టైల్ అని ప్రచారం చేస్తున్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ పేదరికానికి ట్విస్ట్ ఇచ్చింది” అన్న క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్టు చేశారు

ఇక వీడియోపై నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. ఈ ఇళ్లకంటే ప్రభుత్వ హాస్టల్‌లో వసతులే మెరుగ్గా ఉంటాయని కొందరు వ్యాఖ్యానించారు. చూస్తే ఏవగింపు కలుగుతున్న ఈ ఇంటి రెంటు రూ.45 వేలుగా నిర్ణయించడం సిగ్గు అనిపించట్లేదా అని ఓ వ్యక్తి మండిపడ్డాడు. రూ.45 వేలు కాదు రూ. లక్ష చేస్తే పోలా అని మరో వ్యక్తి ఎద్దేవా చేశాడు.

కాగా, బెంగళూరులో కూడా ఇలాంటి పలు ఉదంతాలు నెట్టింట హల్‌చల్ చేశాయి. వర్క్ ఫ్రం హోం ముగియడంతో నగరంలో ఇంటి అద్దెలకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. ఫలితంగా అనేక మంది పేయింగ్ గెస్టు అకామడేషన్ లేదా హాస్టల్‌లో ఉంటే బాగుంటుందని అనుకుంటుంటే మరికొందరు మాత్రం సొంత ఇళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇంత భారీగా అద్దెలు చెల్లించే బదులు అప్పోసొప్పో చేసి ఇల్లు కొనుక్కుంటే మనకంటూ ఓ గూడు మిగిలి ఉంటుందని అనేక మంది భావిస్తున్నారు. కొందరు మాత్రం ఇతరులతో కలిసి ఇంటి అద్దెను పంచుకుంటే అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. పేయింగ్ గెస్ట్ అకామడేషన్‌తో వచ్చే ఆంక్షలకంటే ఇదే మెరగని వాదిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.