Diesel: ఏరులై పారిన డిజీల్.. ఎగబడ్డ జనం.! తోడుకున్నోడికి తోడుకున్నంత..
గత కొన్ని నెలలుగా రైలు ప్రమాదానికి సంబంధించిన ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కావాలనే కొందరు వ్యక్తులను రైలును పట్టాలు తప్పేలా చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వర్షాలు, వరదల కారణంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఘటన మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది.
గత కొన్ని నెలలుగా రైలు ప్రమాదానికి సంబంధించిన ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కావాలనే కొందరు వ్యక్తులను రైలును పట్టాలు తప్పేలా చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వర్షాలు, వరదల కారణంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఘటన మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయని తెలిసింది. ఢిల్లీ-ముంబయి లైన్‌లో పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న గూడ్స్ రైలు.. రైల్వే యార్డు సమీపంలో ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది.
అయితే, పెట్రోలియం గూడ్స్ రైలులో మూడు బోగీలు పట్టాలు తప్పటంతో బోగీల్లోంచి డిజీల్ లీకైంది. పట్టాల వెంట ఆయిల్ ఏరులై పారింది. అది చూసిన స్థానికులు ఎగబడ్డారు. బిందేలు బక్కెట్లతో తోడుకుని వెళ్లారు. చిన్నా, పెద్దా అంతా బారులు తీరారు.. బక్కెట్లతో డిజీల్ నింపుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్‌లో వైరల్‌గా మారాయి.
గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. ఘటనకు సంబంధించి రత్లామ్ డీఆర్‌ఎం రజనీష్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. వ్యాగన్ నుండి డీజిల్ లీక్ అయిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రమాదం జరిగిన రైల్వే లైన్ వెంట రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తున్నామని, కొన్ని రైళ్లు కాస్త ఆలస్యం కావొచ్చునని ఆయన తెలిపారు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.